మొత్తానికి తెలుగుదేశం పార్టీ పాతబాణీలోనే సాగుతూ ఉంది. జనాలు తమను తిరస్కరించిన వైనాన్ని పూర్తిగా మరిచిపోయినట్టుగా వ్యవహరిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను పట్టుకుని ఫ్యాక్షనిస్టుగా సంబోధిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు తమ కసిని తీర్చుకుంటూ ఉన్నారు.
రాష్ట్రంలో అశాంతి రాజ్యం ఏలుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించేస్తూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడుకు ఇల్లు కేటాయించాల్సింది పోయి, ఆయన ఉన్న ఇంటిని జగన్ కూల్చేస్తూ ఉన్నాడని.. అది ఆయన ఫ్యాక్షన్ స్వభావం అని తెలుగుదేశం పార్టీ చెప్పుకొస్తోంది.
అయినా అది అక్రమ కట్టడం అని తేలుతున్నప్పుడు ఇంకా దాని చూరును పట్టుకుని వేలాడుతూ ఉండటం ఏమిటో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకే తెలియాలని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అక్రమ కట్టడం అంటూ నోటీసులు అందుకున్నాకా.. ఇంకా ఆ ఇంట్లోనే ఉండటానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు అంతగా పట్టుపడుతున్నారో అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జగన్ మీద విరుచుకుపడుతూ ఉంది. వైఎస్ ను కూడా వదలడం లేదు! వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు అని, ఒక ఫ్యాక్షనిస్టు పాలిస్తే ఎలా ఉంటుందో ఆయన చూపించారని, ఇప్పుడు జగన్ మరో ఫ్యాక్షనిస్టులా పాలిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారు.
వైఎస్ ను ఉమ్మడి ఏపీ ప్రజలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తెలుగుదేశాన్ని చిత్తు చేసి జగన్ ను సీఎంగా చేశారు ఏపీ ప్రజలు. ప్రజా తీర్పుకు కాస్త అయినా విలువ ఇచ్చి.. ఇలాంటి మాటలను తెలుగుదేశం కంట్రోల్ చేసుకుంటే ఆ పార్టీకే మంచిదేమోనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.