నేత‌ల అత్యుత్సాహం.. లోకేష్‌ నే తోసేశారే!

Update: 2017-10-27 04:42 GMT
అస‌లే మంత్రి! ఆపై ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు! అంతేకాక పార్టీలో నెంబ‌ర్ 2గా మారి అంద‌రినీ గుప్పెట్లో పెట్టుకునేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న యువ‌నేత‌!! మ‌రి అలాంటి వ్య‌క్తి వ‌స్తే నాయ‌కులు - కార్య‌క‌ర్త‌ల‌ హ‌డావుడి ఏ రేంజ్లో ఉంటుందో ఊహకే అంద‌దు క‌దూ! ఎలాగైనా ఆయ‌న దృష్టిలో ప‌డిపోయి.. క్రెడిట్ కొట్టేసేందుకు వీరు ప‌డే అత్యుత్సాహం అంతా ఇంతా కాదు!! తప్ప‌దు మ‌రి.. మ‌నం ఎక్క‌డ తగ్గిపోతామ‌నే ఆలోచన కంటే అవ‌తలివాడి మీదే ఎక్కువ శ్ర‌ద్ధ ఉంటుంది. ఈ అతి ఉత్సాహ‌మే కొన్ని సార్లు నాయ‌కుల‌ను కూడా ఇబ్బందుల్లో ప‌డేస్తుంది. ఇలా కార్య‌క‌ర్త‌లు చూసిన అత్యుత్సాహం మంత్రి లోకేష్‌ తో పాటు ఇత‌ర నాయ‌కుల‌కు చుక్క‌లు చూపించింది.

సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు - మంత్రి లోకేష్ ఇటీవ‌ల కాలికి చ‌క్రాలు క‌ట్టుకుని జిల్లాల్లో వ‌రుస‌గా పర్య‌టించేస్తున్నారు.  త‌న‌ను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. ఇక ఏ జిల్లాకు వెళ్లినా అక్క‌డి నేత‌లు.. ఆయ‌న్ను అంతే రేంజ్లో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మ‌ర్యాద‌లకు ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటూ ఇప్ప‌టి నుంచే ఆయ‌న్ను ప్ర‌సన్నం చేసుకునే ప‌నిలో ప‌డిపోతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో కొన్నిసార్లు కార్య‌క‌ర్త‌లు - నాయ‌కులు చూపిన అత్యుత్సాహం లోకేష్‌ ను కూడా చిక్కుల్లో ప‌డేస్తోంద‌ట‌. ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌కాశం జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించిన‌ప్పుడు గౌర‌వ మ‌ర్యాద‌ల విష‌యంలో పలువురు నేతలు తీవ్రంగా పోటీ పడ్డారు.

నారా లోకేష్ పర్చూరు - అద్దంకి - ఎస్‌ ఎన్‌ పాడు - ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. లోకేష్‌ పర్యటనల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు మాత్రం లోకేష్‌ కు మర్యాదల చేసేందుకు పోటీపడ్డారు. బుధవారం నారా లోకేష్ కర్నూలు రోడ్డు ఫ్లైవోవర్‌ వద్ద తెలుగుతల్లి - ఎన్టీఆర్‌ - దామచర్ల ఆంజనేయులు కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సమయంలో కార్యకర్తల ఉత్సాహం హ‌ద్దులు దాటిపోయింది. దీంతో లోకేష్‌ తోపాటు దామచర్లను తోసేశారు. కార్యకర్తలను - నాయకులను నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక లోకేష్ పర్యటనలో దొంగలు కూడా త‌మ చేతి వాటాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఒంగోలు ఆర్డీవో శ్రీనివాసరావుతోపాటు ముగ్గురు జిల్లా అధికారుల పర్సులు కొట్టేశారు. మంత్రి లోకేష్ ప్రైవేటు పీఎస్‌ సెల్‌ ఫోన్ దొంగిలించారు. ఓవైపు పర్యటన జరుగుతుండగా మరోవైపు దొంగలు తమ పని కానిచ్చారు.
Tags:    

Similar News