ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు జన్మభూమి- మా ఊరు పేరిట ఓ సుదీర్ఘ కార్యక్రమానికి తెర తీసిన సంగతి తెలిసిందే. నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి నేటి (ఈ నెల 11) దాకా నిర్వహించిన ఈ కార్యక్రమం నేటితో ముగియనుంది. ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించిందని సాక్షాత్తు సీఎం హోదాలో చంద్రబాబే నిన్న ఘనంగా ప్రకటన చేశారు. తొలి 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి 60 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని - తమ తమ సమస్యలు విన్నవించారని - ఈ సమస్యల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించామని, మిగిలిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా నేటితో ముగియనున్న ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని కూడా చంద్రబాబు జబ్బలు చరుచుకున్నారు.
అయితే చాలా చోట్ల జన్మభూమికి హాజరైన తెలుగు తమ్ముళ్లు తమతో తామే తన్నులాడుకుంటే... మరికొన్ని చోట్ల ఏకంగా అధికారులపైనే పిడిగుద్దులు కురిపించారు. మెజారిటీ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం... చంద్రబాబు చెప్పినట్లుగా ఈ కార్యక్రమం అంతగా సక్సెస్ కాకపోయినా... ఓ మోస్తరు జనం స్పందించారనే చెప్పాలి. మరి జనం స్పందించిన తీరుగా ప్రభుత్వం కూడా సమస్యల పరిష్కారంపై ఏమాత్రం చొరవ చూపుతుందో చూడాలి. అయినా ఇప్పుడు జన్మభూమి కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏముందన్న విషయానికి వస్తే.. మనం ఇప్పుడు నేరుగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసమంటూ నిర్వహించిన ఈ సదస్సులో తెలుగు తమ్ముళ్లు చిందులేసి మరీ వార్తల్లో నిలిచారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో నేడు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వేదికపైనే చిందులేసిన తెలుగు తమ్ముళ్లు తమదైన రీతిలో రెచ్చిపోయారు.
జన్మభూమి వేదికగా తెలుగు తమ్ముళ్లు మామూలుగా చిందులేశారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.... ఇటీవల మాస్ మహారాజాగా టాలీవుడ్ లో పేరుగాంచిన రవితేజ తాజా చిత్రం రాజా ది గ్రేట్ చిత్రంలోని హిట్ పాట గున్నా.. గున్నా... మామిడి పాట పెట్టుకుని మరీ తెలుగు తమ్ముళ్లు చిందులేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చామంటూ బిల్డప్పిచ్చిన తెలుగు తమ్ముళ్లు... వేదిక మీదే గున్నా గున్నా మామిడి అంటూ చిందులేసిన తీరుపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా సమస్యలు వింటామంటూ వచ్చి.... ఇలా గున్నా గున్నా మామిడి అంటూ గోల గోల చేస్తే ఎలాగంటూ కూడా కొందరు తెలుగు తమ్ముళ్లను ప్రశ్నించారట. అయినా గున్నా గున్నా మామిడి పాట ఇచ్చిన హుషారుతో మంచి ఊపు మీద ఉన్న తెలుగు తమ్ముళ్ల చెవులకు ఈ ప్రశ్నలు వినిపించనే లేదట. మరి జన్మభూమి వేదికపై ఈ గున్నా గున్నా మామిడి ట్యూన్లు - వాటికి తెలుగు తమ్ముళ్ల చిందులపై చంద్రబాబు ఏమంటారో చూడాలి.
Full View