తెలుగుదేశం పార్టీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైంది. మరో ఆరునెలల్లో జరగబోయే ఎన్నికలను ఎదుర్కోవడం కంటే...ఇప్పుడు ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా సాగుతున్న పరిణామాలు పచ్చపార్టీ నాయకులను పరేషాన్ చేస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి - నటుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మరిచిపోక ముందే విశాఖ జిల్లాలో పార్టీకి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు - సివేరి సోమ మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కలవరం ఇంకా సద్దుమణగక ముందే తాజాగా గీతం అధ్యక్షులు - టీడీపీ మాజీ ఎంపీ - మాజీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తిని అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. దీంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైందని అంటున్నారు.
ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించించేందుకు గీతం యూనివర్సిటీ అధినేత - ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికా వెళ్లారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి అలాస్కకు వెళుతున్న సమయంలో ఎంవీవీఎస్ మూర్తితో పాటు మరో ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాలిఫోర్నియా నుంచి అలస్కాకు వెళుతున్న వీరి కారును ఫోర్ట్ ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మూర్తితో పాటు ‘వెలవోలు బసవపున్నయ్య - వీరమాచినేని శివప్రసాద్ - వి.బి.ఆర్.చౌదరి(చిన్నా) మృతి చెందారు. వీరితో పాటు ప్రయాణిస్తోన్న ‘కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గతంలో సంభవించిన రోడ్డు ప్రమాదాలలో ఎర్రనాయుడు - లాల్జాన్ పాషా మృత్యు వాత పడ్డారు. ఇటీవల పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు - మాజీ ఎంపీ హరికృష్ణ కన్నుమూశారు. ఆ విషాదం నుంచి కోలుకునేలోగానే..మరో మాజీ ఎంపీ అదే రీతిలో మృత్యువాత పడటం అనేకమందిని కలవరానికి గురిచేస్తోంది. ముఖ్యనేతలు వరుసగా రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.