జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల తీరుపై తెలుగు తమ్ముళ్లు చిరాకు పడిపోతున్నారు. ఆలూ లేదు చూలు లేదు మొగుడుపేరు సోమలింగం అన్నట్లుగా పవన్ గణం తీరు ఉందని ఫైర్ అవుతున్నారు. ఏం చూసుకొని ఇలా చేస్తున్నారంటూ తెగ చిరాకు పడిపోతున్నారు. ఇంతకూ తెలుగు తమ్ముళ్లు ఇంతలా ఇరిటేట్ కావటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. జనసేనాధిపతి అభిమానుల తీరే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
ఉద్దానంలో కిడ్నీ బాధితుల ఇష్యూ మీద నిన్న (ఆదివారం) విశాఖలో సదస్సు నిర్వహించగా.. ఈ సమస్యపై పరిశోధన చేసిన హార్వర్డ్ వైద్యుల బృందాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావాలని డిసైడ్ చేశారు. వైద్యుల బృందంతో పవన్ తనను కలవటానికి వస్తున్న నేపథ్యంలో తన గోదావరి జిల్లా పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ఇదిలాఉంటే.. నిన్నటి విశాఖ ఎయిర్ పోర్ట్ లోనూ.. ఈ రోజు గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనూ.. పవన్ అభిమానులు.. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయటం తెలుగు తమ్ముళ్లను విపరీతంగా బాధిస్తోంది.
జనసేన పార్టీకి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే లేరని.. ఎన్నికలు వస్తే..ఎన్ని సీట్లు గెలుస్తాయన్న విషయం మీద ఏ మాత్రం క్లారిటీ లేని వేళ.. ఇలాంటి అత్యుత్సాహపు నినాదాలు చేయటం ఏమిటంటే మండిపడుతున్నారు. ఓపక్క పవన్ తనకు పదవుల మీద ఆశ లేదని చెబుతారని.. మరోవైపు ఆయన అభిమానులు మాత్రం సీఎం.. సీఎం అంటూనినాదాలు చేయటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఓపక్క ఏపీ ప్రభుత్వానికి మిత్రపక్షమన్నట్లుగా వ్యవహరిస్తూనే.. ఒక సీఎంను చిన్నబుచ్చేలా అభిమానులు నినాదాలు చేస్తుంటే పవన్ ఎందుకు కంట్రోల్ చేయరని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా పవన్ అభిమానుల నినాదాలు సరిగా లేవని.. ఇది మంచి పద్దతి కాదని తెలుగు తమ్ముళ్లు స్పష్టం చేస్తున్నారు.