-ఏపీలో పోలింగ్ కు సమయం ఆసన్నం అవుతూ ఉంది. మరి కొన్ని గంటల ప్రచార పర్వం మిగిలి ఉంది. రేపు ప్రచారానికి పూర్తిగా విరామం. ఎవరూ రోడ్డు ఎక్కి ఓటు అడిగే పరిస్థితి ఉండదు. ముఖ్య నేతలకు ఈ షరతు ఉంటుంది.
-ఎవరి నియోజకవర్గాల్లో వారు కూర్చుని ఇక పోల్ మేనేజ్ మెంట్ మీద - తమ వాళ్లందరూ తప్పకుండా ఓటు వేయించుకోవడం మీద వారు దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది.
-ఇక అధికారంలో ఉండిన టీడీపీ వాళ్లు సుదీర్ఘ ప్రచారం అనంతరం.. తమ పార్టీకి ప్లస్ మైనస్ ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే వారి ఆందోళన కొన్ని అంశాల మీదే ప్రధానంగా ఉండటం విశేషం.
-తెలుగుదేశం పార్టీకి బాగా ఆందోళన రేపుతున్న అంశంలో నారా లోకేష్ బాబు ఉండటం విశేషం! ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల పోటీకి దిగిన లోకేష్ విషయంలో తెలుగుదేశం వాళ్లు టెన్షన్ పడుతూ ఉన్నారు.
-లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల ప్రచారానికి దిగి.. ప్రచారం సాగించినా - తను నిరూపించుకున్నది ఏమీ లేదు అనేది టీడీపీ వాళ్లు కూడా ఒప్పుకుంటున్న విషయం.
-మంగళగిరిలో వివిధ యూట్యూబ్ చానళ్ల వాళ్లు పబ్లిక్ టాక్ ను ఒడిసి పట్టగా, అందులో చాలా మంది లోకేష్ మాట తీరు మీద ఎద్దేవా చేస్తూ మాట్లాడారు - వ్యంగ్యంగా స్పందించారు. ఈ మాటలే తెలుగుదేశం పార్టీని బాగా ఆందోళనకు గురి చేస్తున్నాయనే మాట వినిపిస్తోంది.
-ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు తన తనయుడిని మరింతగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందని, అధికారం దక్కితే లోకేష్ ను సీఎంగా చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇది పార్టీకి మరింతగా నష్టం చేసే అంశం అవుతోందని తెలుగుదేశం వాళ్లు భయపడుతున్నారట.
-లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడేమో అనే భయం.. తెలుగుదేశం పార్టీకి కొంత ఓటు బ్యాంకును దూరం చేస్తుందని క్షేత్ర స్థాయి పరిశీలనల్లో తేలిందని తెలుస్తోంది.
-ఈ సారి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత - ఒంటరి పోరు ఇబ్బందికరమైన అంశాలు అని అందరూ చెబుతున్నారు.
-ఇంత వరకూ తెలుగుదేశం చరిత్రలో ఒంటరి పోరు చేసినది లేదు. తొలిసారి ఆ పార్టీ సోలోగా ఎన్నికలను ఎదుర్కొంటోంది. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత పార్టీకి నష్టం చేసేలా ఉంది.
-టీడీపీలో బాగా ఆందోళన రేపుతున్న అంశాల్లో.. ఒంటరి పోరు, ప్రభుత్వ వ్యతిరేకత ప్రధానమైనవి అయితే, ఆ తర్వాత లోకేష్ ఇమేజే పార్టీని బాగా దెబ్బతీసే అంశమని తెలుగుదేశం నేతలే ఆఫ్ ద రికార్డుగా వ్యాఖ్యానిస్తుండటం విశేషం.
-తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయం విషయంలో లోకేష్ మైనస్ పాయింట్ అవుతున్నారని, ఏ జూనియర్ ఎన్టీఆరో ఇలాంటి సమయంలో ఉంటే ఆ ఊపు వేరని, లోకేష్ వల్ల పార్టీ గ్రాఫ్ తగ్గుతోందని ఆ పార్టీ వారే గొణుక్కొంటున్నారు. అయితే ఎవరూ ఇప్పుడు బయటపడే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు తేడా కొడితే.. అప్పడు ఇలాంటి వాయిస్ లు గట్టిగా రైజ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది!