అనుకున్నదే జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారుకు ఏదైతే ఇబ్బందిగా మారి.. ఆయన్ను అప్రదిష్ట పాలు చేస్తుందన్న సందేహాలు ఉన్నాయో.. చివరకూ అదే నిజమని తేలింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబుకు పవర్ రావటాన్ని చాలామంది అదృష్టంగా అభివర్ణించారు. అయితే.. అది కత్తి మీద సాము లాంటిదని.. పదేళ్ల గ్యాప్ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బాబుకు.. భారీ కమిట్ మెంట్లు ఉన్నాయని.. ఈ విషయంలో ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా.. ఆయన భారీ అపకీర్తి మూటకట్టుకోవటం ఖాయమన్న వాదన వినిపించింది.
విభజన నేపథ్యంలో కొత్త రాజధాని నిర్మాణంతో ఆయన చరిత్రలో నిలిచిపోతారన్న వాదనను కొందరు వినిపించినా.. ఈ విషయంలో పొరపాట్లు.. తప్పులు జరిగే ఛాన్స్ లు చాలా ఎక్కువని.. ఆయన పీకల్లోతు ఆరోపణల్లో చిక్కుకుపోవటం ఖాయమన్న మాటను పలువురు బల్ల గుద్ది మరీ చెప్పారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి సాక్ష్యాల రూపంలో బయటకు వచ్చింది.
ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి పెద్ద ఎత్తున భూమిని సేకరించిన ప్రభుత్వం.. అందుకు ప్రతిఫలంగా భారీ పరిహారం.. నివాస.. వాణిజ్య ప్లాట్లను కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. ఇదంతా ఎలాంటి పొరపాట్లకు.. తప్పులకు అవకాశం లేకుండా ఇస్తామన్న మాటను చెప్పారు. అయితే.. రైతుల భూములపై తెలుగు తమ్ముళ్లు కన్నేశారని.. ఫ్లాట్ల కేటాయింపు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్న వాదనలు బలంగా వినిపించాయి.
తాజాగా ఆ మాటలు ఎంత నిజమన్న విషయాన్ని జగన్ పత్రిక సాక్షి సాక్ష్యాలతో సహా ప్రచురించి సంచలనం సృష్టిస్తోందిది. ల్యాండ్ ఫూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల కేటాయింపులో భారీగా అవకతవకలు చోటు చేసుకున్న విషయాన్ని ఆరోపించటమే కాదు.. ఆధారాల్ని చూపించి అవాక్కు అయ్యేలా చేశారు.
ల్యాండ్ ఫూలింగ్ కోసం రైతులు.. సామాన్యులతో పాటు.. అధికారపక్షానికి చెందిన ముఖ్యనేతల అనుచరులు.. బంధువులు.. స్నేహితులు.. బినామీలు భారీగా భూముల్ని కొనేసి ప్రభుత్వానికి ఇచ్చేసి.. కీలకమైన ప్రాంతాల్లో తమకు ప్లాట్లు కేటాయించుకునేలా చేసుకోవటం సక్సెస్ అయ్యారన్న ఆరపణ ఎంత నిజమన్న విషయాన్ని రుజువులతో సహా అచ్చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అమరావతి కోసం 29 గ్రామాల్లో ఏపీ సర్కారు భూముల్ని సేకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎకరం జరీబు భూమిని తీసుకుంటే 1450 చదరపు గజాల ఫ్లాటు కేటాయించారు. ఇందులో 1200 చదరపు గజాల్లో నివాసం.. 250 చదరపు గజాల్లో వాణిజ్య ఫ్లాటును ఏర్పాటు చేయటం తెలిసిందే. అదే సమయంలో ఎకరం మెట్ట భూమిని ఇచ్చిన వారికి 1200 గజాల భూమిని ఇచ్చారు. ఇందులో వెయ్యి చదరపు గజాల్లో నివాస స్థలం.. 200 చదరపు గజాల్లో వాణిజ్య ఫ్లాట్లను కేటాయించారు. ఈ కేటాయింపులన్నీ ఆన్ లైన్లోనే సాగుతాయని చెప్పినప్పటికీ.. జరిగింది మాత్రం అందుకు భిన్నంగా ఉందన్న విషయాన్ని సాక్ష్యాలతో ప్రచురించినట్లుగా చెబుతోంది సాక్షి.
తమ ఆరోపణలకు తగ్గట్లే కొన్ని ఆధారాల్ని ప్రచురించింది. అమరావతిలో కీలకభూమిక పోషిస్తున్న మంత్రి నారాయణ తన బంధువులు.. సన్నిహితులైన రాపూరు సాంబశివరావు.. ఆవులు మునిశంకర్.. పోతూరు పరిమళ.. వరుణ్ కుమార్ ల పేర్లతో రాజధాని గ్రామాలైన మందడం.. లింగాయపాలెం.. రాయపూడి.. కొండమరాజుపాలెంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వారి భూములకు సంబంధించిన కేటాయించిన ఫ్లాట్లను పరిశీలిస్తే చాలానే సందేహాలు రావటం ఖాయం. ఎందుకంటే.. వారికి కేటాయించిన భూములు సచివాలయానికి ముందు గ్రామమైన మందడంలో 25 వేల చదరపు గజాలు ఒకటే ఫ్లాటును దక్కించుకోవటం ఒక ఎత్తు అయితే.. తూర్పు.. ఉత్తరం.. దక్షిణం 100 అడుగుల రహదారి ఉన్న ప్రాంతంలో వీరికి ఫ్లాటు కేటాయించారు. అంతేకాదు.. వీరికి కేటాయించిన ఫ్లాట్లు కార్నర్ బిట్లు కావటం గమనార్హం.
నిజానికి మంత్రి నారాయణ ఒక్కరే కాదు.. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్.. మంత్రి పల్లె..ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్.. గుంటూరుజిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు.. పలువురు టీడీపీ నేతలకు కార్నర్ బిట్లలో ఫ్లాట్లను కేటాయించిన వైనం పెను దుమారంగా మారింది. పార్టీ నేతలకు విలువైన ప్రాంతాల్లో ఫ్లాట్లు కేటాయింపులు జరిపి.. రైతులు.. సామాన్యులకు మాత్రం వాస్తు లోపంతో ఉన్న ఫ్లాట్లను.. పెద్దగా ప్రాధాన్యత లేని ప్రాంతాల్లో ఫ్లాట్లను కేటాయించినట్లుగా తెలుస్తోందంటూ అచ్చేసిన వార్తాకథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి.. దీనిపై బాబు సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/