బాబు మాకు భేఖాతార్‌... వైసీపీతో చేతులు క‌లుపుతోన్న టీడీపీ...!

Update: 2022-12-14 05:01 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయో..ఎప్పుడు ఏం జ‌రుగుతుందో.. అనే ఉద్దేశంతో ముందుగానే పార్టీలో భారీలో సంఖ్య‌లో క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మండ‌లాలు, జిల్లాలు, నియోజ‌వ‌క‌ర్గాలు, పార్ల‌మెంట‌రీ జిల్లాలు అంటూ.. పెద్ద ఎత్తున ఈ ఏడాది ప్రారంభంలో హ‌డావుడి చేశారు. ఆయా ప్రాంతాల‌కు ప‌రిశీల‌కులు.. నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జులు అంటూ.. అంద‌రికీ ప‌ద‌వులు ఇచ్చేశారు.

క‌ట్‌చేస్తే.. ఇవ‌న్నీ చంద్ర‌బాబు ఏవ్యూహంతో చేశారో.. ఇప్పుడు ఆ వ్యూహం స‌క్సెస్ కావ‌డం లేదు. ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాలి.. పార్టీని లైన్‌లో పెట్టాలి.. అసంతృప్తుల‌ను త‌గ్గించాలి.. ఈ వ్యూహంతోనే చంద్ర‌బాబు త‌న పార్టీలో భారీ సంఖ్య‌లో నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇచ్చారు.

మ‌రి ఈమూడు సూత్రాల‌ను ప‌ట్టుకుని నాయ‌కులు ముందుకు సాగుతున్నారా?  పార్టీ పుంజుకుందా? అంటే.. లేద‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. చాలా మంది నాయ‌కులు.. ప‌ద‌వులు పొందినా.. ఊర‌కుంటున్నారు.

ఎందుకంటే.. ఈ ఏడాది మ‌హానాడు స‌మ‌యంలోనే కొంద‌రు నాయ‌కులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ని చంద్ర‌బాబుకు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. అయ్యా అక్క‌డ మ‌న నాయ‌కులే.. వైసీపీ వారితో చేతు లు క‌లుపుతున్నారు.

ప‌నులు చేయించుకుంటున్నారు. మ‌న కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నార‌ని కొంద‌రు స్ప‌ష్టం చేశారు. మ‌రికొంద‌రు.. పార్టీలో అసంతృప్తుల‌ను త‌గ్గించేందుకు మాకు కూడా కొన్ని అధికారాల‌ను ఇవ్వాల‌ని మొర‌పెట్టుకున్నారు.

కానీ, చంద్ర‌బాబు మాత్రం మీ ప‌నిమీరు చేయండి! అని ముక్త‌స‌రిగా స‌మాధానం ఇచ్చారు. కానీ, ఎవ‌రిప‌ని వారు చేయాలంటే.. స‌హ‌క‌రించే నాయ‌క‌గ‌ణం కూడా ఉండాలిక దా! అది లేక‌పోవ‌డంతో ఇంత మండి ఇంచార్జులు ఉండి కూడా పార్టీకి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు గృహ‌సార‌థులు అంటూ.. వైసీపీ కొత్త ప‌ల్ల‌వి అందుకుంటే.. మ‌నం ఏం చేయాలంటూ.. నాయ‌కులు దిక్కులు చూస్తున్నారు. ఇదీ.. సంగ‌తి!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News