తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచిత్ర పరిస్థితిని ఎదుర్కుంటున్నారని అంటున్నారు. ఈనెల 19న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఖాయంగా ఐదు స్థానాలు దక్కే అవకాశం ఉండటంతో బాబుపై పాజిటివ్ ప్రెజర్ పెరుగుతోంది. ఫలానా కోణంలో తాము పార్టీకోసం త్యాగం చేశామని కొందరు అంటుండగా... మరో కేటగిరీలో తమకు అవకాశం ఇవ్వాలని ఇంకొందరు విన్నవిస్తున్నారు. గతంలో టికెట్లు లభించని వారు - ఇప్పటివరకూ జరిగిన ఎంపికల్లో స్థానం దక్కని సామాజికవర్గాలు ఈసారి ఎన్నికల్లో అవకాశం కోసం పార్టీ నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు - జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తోపాటు పొలిట్ బ్యూరో సభ్యులు - జిల్లా మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఐదు స్థానాల్లో బాబు తనయుడు లోకేష్ కు ఖరారు కాగా - మిగిలిన నాలుగు సీట్లపై పోటీ పెరుగుతోంది. అయితే, ఇటీవల తనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చిరకాల మిత్రుడు కరణం బలరామ్ ను పిలిపించి మాట్లాడిన సందర్భంలో, ఎమ్మెల్సీ సీటు ఇస్తానని బాబు హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రకారంగా ఇక ఉన్న మూడు సీట్లపైనే పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటా ముగిసిన తర్వాత ఉన్న రెండు గవర్నర్ కోటా సీట్లకూ అప్పుడే పోటీ మొదలయింది. తాజాగా ముగిసిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిళలకు అవకాశం దక్కనందున, ఎమ్మెల్యే కోటాలోనయినా స్థానం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సినిమా అవకాశాలు కూడా వదులుకుని పార్టీ కోసం ప్రచారంతోపాటు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న సినీనటి - వైశ్య వర్గానికి చెందిన కవిత ఈసారి సీటు ఆశిస్తున్నారు.ఇక గతంలో ఒకసారి అవకాశం వచ్చి చేజారిపోయినందున ఈసారి తనకు సీటు ఇస్తారని చేనేత వర్గానికి చెందిన పంచుమర్తి అనూరాధ భావిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసి, తర్వాత ఇన్చార్జి పదవి కూడా పోగొట్టుకున్న అదే సామాజికవర్గానికి చెందిన సునీతకు ఈసారి సీటు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ కార్యాలయాన్ని అంటిపెట్టుకుని పనిచేస్తున్న వారందరికీ ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిన నాయకత్వం నుంచి ఆ కోటాలో మిగిలిన పోయిన రవియాదవ్ - టిడిఎల్పీ కార్యాలయ సమన్వయకర్త సురేష్ కూడా సీటు ఆశిస్తున్నారు. వీరిద్దరూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన వారే. ఇక ప్రస్తుత మండలి వైస్ చైర్మన్ - కడపకు చెందిన సతీష్ రెడ్డి - దళిత వర్గానికి చెందిన ప్రతిభాభారతి కూడా రెన్యువల్ కోరుతున్నారు. అనంతపురంలో తమ వర్గానికి బలం ఉన్నప్పటికీ ఇవ్వకుండా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న బలిజ వర్గం - ఇప్పటివరకూ అవకాశాలు దక్కని వైశ్య - బ్రాహ్మణ - మాదిగ - ఎస్టీ వర్గాలు సీటుపై ఆశలు పెట్టుకున్నారు. మాదిగ వర్గానికి చెందిన సీనియర్ నేత వర్ల రామయ్య సీటు ఆశిస్తున్నారు. ఇలా పాజిటివ్ ఒత్తిడిని బాబు ఎదుర్కోవడం కొత్తకాదని అంటున్నారు. త్వరలోనే ఈ సమస్యకు బాబు ఫుల్ స్టాఫ్ పెడతారని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/