త‌మ్ముళ్ల నివేదిక‌ల కామెడీ మామూలుగా లేదుగా?

Update: 2019-05-02 12:13 GMT
తుది ఫ‌లితం త‌ర్వాత ఎటూ ఏడుపు త‌ప్ప‌దు. అప్ప‌టివ‌ర‌కూ ఆనందంలో ఉంచేద్దామ‌ని భావిస్తున్నారో ఏమో కానీ.. తెలుగు త‌మ్ముళ్లు త‌యారు చేస్తున్న నివేదిక‌లు కామెడీ పీస్ లుగా మారుతున్నాయి.  ఏదో ఒక ప‌ని పెట్టుకుంటూ బిజీ.. బిజీగా ఉండ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అల‌వాటే. ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌ల‌కు మూడు వారాల‌కు పైనే స‌మ‌యం ఉన్న వేళ‌.. ఏదో ఒక యాక్టివిటీతో బండి లాగిస్తున్నారు చంద్ర‌బాబు.

తాజాగా ఆయ‌న రోజుకు రెండు జిల్లాల చొప్పున పార్టీ రివ్యూను షురూ చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీకి విజ‌య అవ‌కాశాలు ఎలా ఉన్నాయ‌న్న విష‌యాన్ని ఆయా జిల్లాల నేత‌ల‌తో భేటీ అయి.. మ‌దింపు చేయ‌టం ద్వారా.. ఫ‌లితాల వెల్ల‌డికి ముందే.. గెలుపు లెక్క‌ల్ని చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

అయితే.. ఇలాంటి లెక్క‌ల్లోకి వెళ్లేట‌ప్పుడు.. నిజాయితీ చాలా ముఖ్యం. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పే ధైర్యం ఉండాలి. అది తెలుగు త‌మ్ముళ్ల‌లో ఎంత‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌డ‌ప జిల్లా త‌మ్ముళ్లు త‌యారు చేసిన నివేదికను చెప్పాలి. వివిధ వ‌ర్గాల గ్రౌండ్ రిపోర్ట్ ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో గెలిచే అవ‌కాశం ఉంది. రెండో స్థానంలో గెలిచే వీలే లేదు.

కానీ.. బాబు కోసం తెలుగు త‌మ్ముళ్లు త‌యారు చేసిన నివేదిక‌లో జిల్లాలో నాలుగుస్థానాల్లో గెలుపు ప‌క్కా అని.. మ‌రో నాలుగు స్థానాల్లో టైట్ ఫైట్ అంటూ కోత‌లు కోసేశారు. ఇక‌.. మూడు స్థానాల్లో పార్టీ నేత‌ల నిర్ల‌క్ష్యం కార‌ణంగా చేజారే వీలుంద‌న్న అంచ‌నాను సిద్ధం చేశారు. గెలిచేది ఒక స్థానం.. అది కూడా అనుమానంగా ఉన్న వేళ‌.. ఏకంగా నాలుగు స్థానాల్లో గెలుపు.. మ‌రో నాలుగు స్థానాల్లో 50:50 అన్న‌ట్లుగా చెప్ప‌టం చూస్తే.. ఇలాంటి నివేదిక‌ల‌తో వేసే లెక్క‌ల‌తో వ‌చ్చే లాభం ఏమిటో చంద్ర‌బాబుకు మాత్ర‌మే తెలియాలి. క‌డ‌ప జిల్లా నేత‌ల మాదిరే మిగిలిన జిల్లాల్లోని త‌మ్ముళ్లు లెక్క‌లు చెబితే.. బాబుకు రిజ‌ల్ట్ షాక్ భారీగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News