టీటీడీపీకి చంద్రబాబు 'గ్రేటర్' షాక్

Update: 2016-01-11 11:28 GMT
గ్రేటర్ ఎన్నికలకు ప్రచారానికి వచ్చేందుకే ఇష్టపడని చంద్రబాబు నాయుడు టీటీడీపీ నేతలు ఎలాగోలా బతిమాలి ఒప్పించి టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. అక్కడితో ఆగకుండా  అభ్యర్దుల ఖర్చుతో పాటు పార్టీ కార్యక్రమాలకు ఫండ్ కేటాయించాలని కూడా వారు చంద్రబాబును కోరడానికి రెడీ అయ్యారట. తమ్ముళ్ల స్పీడు సంగతి తెలిసిన చంద్రన్న వారి కంటే ముందే అసలు విషయాన్ని వారికి చెప్పేశారు. పార్టీ గల్లా పెట్టె ఖాళీగా ఉంది... ఫండ్స్ కోసం చూడొద్దని చెప్పేశారట. దీంతో నిధులు అడగాలని బయలుదేరిన తమ్ముళ్లు నీరసపడిపోయారట.
   
కొంత మంది డబ్బుల్లేని బీసీ - ఎస్సీ అభ్యర్థులకు పరిమిత మొత్త సహాయం చేయడానికి మాత్రం చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. మిగతా ఏర్పాట్లన్నీ అభ్యర్థులు, నాయకులే చూసుకోవాలని సూచించారట.  ఇంకో విషయం ఏంటంటే... టీటీడీపీతో పాటు బీజేపీ కూడా  బాబు ఇచ్చే ఫండ్స్ కోసం చాలా ఆశలు పెట్టుకుంది. దీంతో టీటీడీపీ నేతలు మాకే దిక్కు లేదు... కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు మావైపు చూస్తారేంటి అని వారికి మొహానే చెప్పేశారట. అయినప్పటికీ ఆశ చావని కొందరు టీడీపీ - బీజేపీ నేతలు చంద్రబాబును కలిసి డబ్బులు అడగాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News