శాసనసభకు హాజరు కాకూడదన్న వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయాన్ని వాడుకుంటూ.. ఆ పార్టీని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా బద్నాం చేయడానికి తెలుగుదేశం పార్టీ రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుని విలువలు పాటించాలని అంటున్న వైసీపీ డిమాండ్ ను గాలికొదిలేసి... అసెంబ్లీ శ్రద్ధ లేదని నిందలేయడం మాత్రమే కాదు.. ఊరూరా వారిని రచ్చకీడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిచోటా ఇదే అంశం చర్చకు వచ్చేలా.. ఆ పార్టీ గురించి ప్రజలు చెడుగా అనుకునేలా ఒక స్కెచ్ ప్రకారం తెలుగుదేశం పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు.
తాజాగా కడప జడ్పీ సమావేశంలో.. జరిగిన రసాభాస కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అనేది పలువురి అభిప్రాయంగా ఉంది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు లోకల్ గా ఉన్న హామీల గురించి అడుగుతోంటే.. వారు అసెంబ్లీ కి గైరుహాజరు అవుతున్నారనే అంశం మీదికి తెదేపా ఎమ్మెల్యేలు చర్చను మళ్లించారు. ఫిరాయింపులు ఇంకా ఉన్నాయంటూ సబ్జక్టును డైవర్ట్ చేశారు. అక్కడినుంచి చర్చ కాస్తా రభసగా మారిపోయింది. నాయకులు మాటామాటా అనుకోవడం... సమావేశం వాయిదా పడడం జరిగిపోయాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో తెలుగుదేశం వక్రయుద్ధనీతుల్ని అనుసరిస్తున్నట్లుగా ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. కాల్ ది డాగ్ మ్యాడ్ - బిఫోర్ యూ కిల్ ఇట్ అని ఇంగ్లీషు సామెత. ఒక కుక్కను చంపదలచుకున్నప్పుడు, ముందుగా అది పిచ్చిది అని ముద్ర వేస్తే సరిపోతుందిట. సరిగ్గ చంద్రబాబు సర్కారు కూడా అదే నీతిని అవలంబిస్తున్నదని పలువురు భావిస్తున్నారు. వైసీపీని ఓడగొట్టదలచుకున్నప్పుడు.. ముందుగా ఆపార్టీకి ప్రజలంటే శాసనసభ అంటే విలువలేదని, ప్రజా సమస్యలను పట్టించుకోరని ముద్ర వేయడానికి తెలుగుదేశం చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగానే అసెంబ్లీకి గైర్హాజరు నిర్ణయం ప్రకటించింది. తద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి.. తెదేపా దుర్మార్గపు విధానాలు అందరికీ తెలిసివచ్చేలా చేయాలని అనుకుంది. అయితే రివర్స్ గేర్ లో వీరిని దెప్పిపొడవడానికి తెదేపా ఈ నిర్ణయాన్ని వాడుకుంటూ ఉండడం విశేషం.