అటు బీజేపీకి పోయింది లేదు.. ఇటు బాబుకు వచ్చింది లేదు. కానీ.. వారిద్దరి నడుమ తెలుగుదేశం పార్టీ ఎంపీల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. సొంతంగా అభిప్రాయం లేనట్లుగా వ్యవహరించే తెలుగు తమ్ముళ్లకు.. బాబు కమాండ్స్ ను ఆయన చెప్పినట్లుగా ఢిల్లీలో అమలు చేయటం సాధ్యం కావటం లేదని చెబుతున్నారు.
నిన్నమొన్నటి వరకూ ఆచితూచి వ్యవహరించాలని.. మోడీ అండ్ కోల మనసు నొచ్చుకునేలా మాట్లాడొద్దంటూ జాగ్రత్తలు చెప్పిన బాబు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా కటువుగా ఉండాలంటున్నారు. ఎంపీల్ని రిమోట్ ల మాదిరి వ్యవహరించమని చెప్పటం వారికి మింగుడుపడటం లేదు.
నిన్నటి వరకూ లేని స్నేహాన్ని వ్యక్తం చేయమని చెబుతూ.. ఇప్పుడు మాత్రం కారాలు.. మిరియాలు నూరాలని చెప్పటం.. తానేం అనుకుంటున్నానన్న విషయాన్ని కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాలన్న బరువును ఎంపీల మీద మోపటంతో వారు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నట్లు చెబుతుననారు.
ఒక మాట ఎక్కువ తక్కువ వచ్చినా.. దాని ప్రభావం తమ మీద పడుతుందని.. తమ పరిస్థితు ఆకు మాదిరి మారిందని వారు వాపోతున్నారు. ఏపీకి రావాల్సిన నిధుల లెక్క విషయంలో కరుకుగా ఉండాలని.. ఏపీ హక్కుల మీద ఎక్కడా రాజీ పడొద్దన్న మాట చెబుతున్న చంద్రబాబు చెప్పినట్లుగా ఢిల్లీ స్థాయిలో మాట్లాడటం సాధ్యం కాదన్న మాటను ఎంపీలు చెబుతున్నారు.
మరోవైపు.. ఎంపీలతో భేటీ అవుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. ఇతర ముఖ్యనేతలు తమ వాదనను బలంగా వినిపించటం.. ఏపీకి ఎంతో చేసిన తమను ఏమీ చేయలేదని మాట్లాడతారా? అంటూ గుడ్లు ఉరమటంతో తెలుగు తమ్ముళ్లకు ఏమీ పాలుపోని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మొత్తంగా బీజేపీ.. బాబుల మధ్య నడుస్తున్న వార్ లో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా తెలుస్తోంది.