స్పందిస్తారా?: రోజాకు అనిత సూటి సవాలు?

Update: 2016-03-26 07:12 GMT
ఏపీ అసెంబ్లీలో గత కొద్దిరోజులుగా సాగుతున్న ఆర్కే రోజా వివాదంపై తాజాగా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనపై విధించిన సస్పెన్షన్ వ్యవహారం కుట్రపూరితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపించటం తెలిసిందే. తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు.. కుట్ర పన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమె ఆవేశంగా స్పందించిన నేపథ్యంలో.. ఏపీ అధికారపక్షం ఎమ్మెల్యే అనిత స్పందించారు.

రోజా సస్పెన్షన్ కు కారణం.. ఎమ్మెల్యే అనిత మీద చేసిన అనుచిత వ్యాఖ్యలన్న సంగతి తెలిసిందే. రోజా చేసిన విమర్శలపై స్పందించిన అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఆమె మాటల్లోనిజం లేదన్నారు. సభ సాక్షిగా రోజా తనను దూషించారని చెప్పుకొచ్చారు. తాను అస్సలు దూషించలేదని రోజా చెబుతున్న మాటల్లో నిజం లేదన్న అనిత.. ఒకవేళ రోజా తనను దూషించలేదన్నది నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అనిత సవాలు విసిరారు. ఒకవేళ రోజా కానీ తన ఆరోపణల్ని నిరూపించుకోలేకపోతే.. ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. మరి.. దీనిపై రోజా ఎలా రియాక్ట్ అవుతారో..?
Tags:    

Similar News