జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నేతల ఎదురుదాడి కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పవన్ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ కామెంట్లను తప్పుపట్టారు. ఈ ఎదురుదాడి కొనసాగుతుండగానే టీడీపీ ఎమ్మెల్యే ఒకరు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చారు. తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటే ఒకేనని అన్నారు.అలా బరిలో దిగితే...తానేంటో తెలుస్తుదని వ్యాఖ్యానించారు.
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తాజాగా ఏపీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమని ఆరోపించారు. బీజేపీ సూచనల మేరకు పవన్ ఈ ఆరోపనలు చేశారని...ఇదే విషయాన్ని తాను గతంలోనే చెప్పానని ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యానించారు. ఏపీలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నది పవన్ ఉద్దేశమని ప్రభాకర్ చౌదరి అన్నారు. సీనియర్ నేత, సమర్థుడు అయిన చంద్రబాబు తర్వాత తనకే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నారని..అందుకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై ఆరోపణల వెనుక మర్మం ఇదేనని ఆయన తెలిపారు.
కాగా, రాబోయే ఎన్నికల్లో అనంతపురం నుంచే పోటీ చేయనున్నట్లు జనసేనాని చేసిన ప్రకటనపైనా ప్రభాకర్ చౌదరి స్పందించారు. ఒకవేళ పవన్ తన నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తే తానుఅందుకు సిద్ధమేనని ప్రభాకర్ చౌదరి అన్నారు. అంతేకాదు పవన్ బరిలోకి దిగితే...తన సత్తా ఏంటో చూపిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.