అధికారులపై 'దేశం' ఎంఎల్‌ ఎల పెత్తనం

Update: 2018-07-13 17:04 GMT
" ఏం....వోళ్లు ఎలా ఉంది. ఇసుక ట్రాక్టర్ తో తొక్కించేస్తా.." పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎంఎల్‌ ఎ మహిళా అధికారిణిపై వేసిన చిందులు. " నీకెన్నిసార్లు చెప్పాలి. ఇక చెప్పడం ఉండదు. చూసుకో ఏం జరుగుతుందో. "

నెల్లూరు జిల్లాలో మరో ఎంఎల్‌ ఎ వీరంగం. " నాకు చెప్పకుండా ఇళ్లపట్టాలు ఎలా ఇచ్చారు. బదీలీపై వెళతావా - సెలవు పై వెళడతావా "  తూర్పుగోదావరి జల్లా కోనసీమకు చెందిన మరో ఎంఎల్‌ ఎ బెదిరింపులు.

ఇవీ ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ ఎంఎల్ ఎల ఆగడాలు. నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ఎంఎల్‌ ఎలు - నాయకుల హూంకరింపులు ఎక్కువయ్యాయి. పది సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉండడంతో ఆ దర్పాన్నీ  - అధికారాన్నీ చేలాయించేందుకు తెలుగుదేశం ఎంఎల్ ఎలు పోటి పడుతున్నారు.  వీరి ఆగడాలకు - హూంకరింపులకు అంతే లేకుండా పోతోంది. వారి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని అదుపు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో తహశీల్దారును గన్నవరం ఎంఎల్‌ ఎ పులపర్తి నారాయణ దుర్భాషలాడారు. పేదలకు ఇళ్లస్ధలాలను ఇవ్వడమే ఆ అధికారి చేసిన తప్పు. తనకు తెలియకుండా ఇళ్ల పట్టాలు ఎందుకిచ్చారంటూ ఎంఎల్‌ ఎ ఫోనులో ఆ అధికారిని బెదిరించారు. " బదీలీపై వెళ్లు. లేదూ సెలవు పెట్టి ఇంటికి వెళ్లు." అంటూ చెలరేగిపోయారు. దీంతో ఆ అధికారికి ముచ్చెమటలు పోసాయి. ఎంఎల్ ఎ వాడిన పదజాలం ఆయన ఆకారణ ఆగ్రహం జిల్లాలో అధికారులందరికీ ఆగ్రహం తెప్పిస్తున్నాయి.అధికారం చేతిలో ఉందికదా అని ప్రభుత్వ సిబ్బందిపై చిటికీ మాటీకీ అధికారులపై నోరు చేసుకోవడం  బెదిరింపులకు పాల్పడడం  ఏమిటని రాష్ట్రంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే ఒకే ఒక్క కారణంతో ప్రజా ప్రతినిధులు ఇలా రెచ్చిపోవడాన్ని అధికారులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. వీటి అధికార చెలాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పి తమ సత్తా ఏమిటో చూపించాలని ప్రభుత్వ సిబ్బంది నిశ్చయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News