అంతా అవాక్కయ్యే పరిణామం ఇది. ఇంకా చెప్పాలంటే...అసలేం జరుగుతోందని అనుమానం వచ్చే పరిస్థితి ఇది. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. తన నియోజకవర్గం పరిధిలోనే టీటీడీ అధికారుల చేతిలో పరాభవం ఎదురవడంతో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. .టీటీడీ పాలకమండలి సభ్యులను అనుమతించి తనను ఎందుకు అనుమతించరని - టీటీడీ అధికారుల తీరును సూటిగా ప్రశ్నించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తానని తేల్చిచెప్పారు.
మహా సంప్రోక్షణకు హాజరవ్వడం కోసం తిరుమల వెళ్లిన ఎమ్మెల్యే సుగుణమ్మ... వైకుంఠం దగ్గర చేరుకోగా... అనుమతి లేదంటూ ఆమెను టీటీడీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళ్తే ఆలయం ముందు ఉన్న బయోమెట్రిక్ ఎంట్రెన్స్ దగ్గరకి వెళ్లి తెలుసుకోవాలన్నారని, సన్నిధిలోని ఫోన్ నంబరుకు కాల్ చేయగా కాల్ చేస్తే అక్కడి అధికారులు ఈ రోజు అనునతిలేదని రేపు రమ్మన్నారని సుగుణమ్మ తెలిపారు. స్వామి వారి మహా శాంతి తిరుమంజననికి ఆలయంలో ఉన్న మహా భక్తులు ఎవరో తమకు చూపించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకు అనుమతి ఉందా లేదా అని టీటీడీ అధికారులను ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానంపై టీటీడీ ఈఓకు - సీఎంకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.