రాజకీయాలకు పెట్టింది పేరు విజయవాడ! ఇక్కడ అంతర్గత కుమ్ములాటలు.. నేతల మధ్య ఆధిపత్య భావం ఇలా అన్నీ ఎక్కువే! ప్రస్తుతం టీడీపీలో ముఖ్యంగా విజయవాడలో నేతల అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కొంతమంది ఎమ్మెల్యేలు నగర మేయర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. అందుకే ఎలాగైనా ఆయన్ను గద్దె దింపేయాలని ప్రణాళిక కూడా వేశారట. వారికి తోడు కార్పొరేటర్లు కూడా తోడవడంతో.. మూకుమ్మడిగా మేయర్ పై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
నగర టీడీపీలో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటలకు దిగుతున్నారు. మేయర్ కోనేరు శ్రీధర్ ను పదవి నుంచి దింపేయడానికి ఒక వర్గం నేతలు పావులు కదుపుతున్నారట. ఇప్పటికే 12మంది కార్పొరేటర్ల నుంచి సంతకాలు సేకరించారట. వాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ.. సంతకాలు తీసుకున్నారట. మెజారిటీ కార్పొరేటర్ల నుంచి సంతకాలు తీసుకున్న తర్వాత.. అందరూ కలిసి సీఎం చంద్రబాబును కలిసి ఆయన్ను గద్దె దించేయాలని కోరనున్నారట.
విజయవాడ సెంట్రల్ - తూర్పు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు - బోండా ఉమ కూడా మేయర్ ను గద్దె దింపేందుకు వెనుకనుంచి సపోర్ట్ ఇస్తామని చెబుతున్నారట. ఇటీవల నగరంలో జరిగిన పార్టీ కార్యక్రమాలకు మేయర్‌కు కనీసం ఆహ్వానం కూడా పంపలేదట. అయితే మేయర్ పట్ల సీఎంకు మంచి అభిప్రాయమే ఉందని తెలుస్తోంది. కానీ కార్పొరేటర్లంతా ఇలా మూకుమ్మడిగా ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తే సీఎం తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరిగిన కార్పొరేటర్ల విహార యాత్రలో శ్రీధర్ వ్యతిరేక వర్గం.. ఇతర కార్పొరేటర్లతో మంతనాలు జరిపినట్టు సమాచారం. కోనేరు శ్రీధర్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని.. ఆయన్ను దించేస్తే అందరికీ లాభం ఉంటుందని కార్పొరేటర్లకు చెప్పారట. ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఒక సీనియర్ కార్పొరేటర్‌కు ఈ సంతకాల సేకరణ బాధ్యత అప్పగించారట. అయితే తన పక్కనున్న వారే ఇలా తన వెనుక గోతులు తవ్వుతుండటం తెలిసి మేయర్ అంతర్గతంగా మథనపడుతున్నారన్న టాక్ ఇప్పుడు బెజవాడ టీడీపీలో వినిపిస్తోంది.