ఆయన పట్టుదల మనిషి. దానికంటే ముందు ఆయన ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. మాట పడరు, పడితే అసలు ఊరుకోరు. అది పార్టీ అధినేత అయినా మరొకరు అయినా ఆయనకు అవసరం లేదు. ఆయనే విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఆయన తన కేశినేని ట్రావెల్స్ మీద విమర్శలు ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయని ఎందుకొచ్చిన ఈ బురద అని ఏకంగా తాత తండ్రుల నుంచి వస్తున్న తొంబయ్యేళ్ల వ్యాపారాన్నే వద్దు అనేసుకున్నారు. ఇక జగన్ వేవ్ లో కూడా గెలిచి తన సత్తా చూపించిన కేశినేని టీడీపీ అధినాయకత్వం తన పట్ల కనబరుస్తున్న వైఖరి పట్ల చాలా కాలంగా రగులుతున్నారు.
అది 2019 ఎన్నికల తరువాత టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నియామకం నుంచే మొదలైంది. తనను కాదని గల్లా జయదేవ్ కి ఆ పదవి ఇవ్వడం పట్ల నాడే అలిగిన నాని ఆ తరువాత క్రమంగా దూరంగా ఉంటూ వచ్చారు. ఇక 2021లో విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెని పోటీకి పెట్టి ప్రెస్టేజ్ ఇష్యూగా ఎన్నికలను తీసుకుంటే పార్టీలోని వారే సహాయ నిరాకరణ చేసి ఓడించారు అన్న బాధ ఆయనకు ఉంది.
ఇక పార్టీలో ఉన్న వారు ఏమీ కాకుండా తనను నానా మాటలు అన్నా దాని మీద ఫిర్యాదు చేసినా కూడా వాటిని అధినాయకత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేయడం మీద ఆయన గుస్సా మీద ఉన్నారు. ఇక కేశినేని నానిని పక్కన పెట్టి ఆయన తమ్ముడు చిన్నిని విజయవాడ ఎంపీ సీట్లో ఫోకస్ లో పెడుతూ ఎగదోయడం పట్ల కూడా నాని కోపం తారస్థాయికి చేరింది అంటారు.
ఇక ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఎయిర్ పోర్టులో ఆయనకు పుష్ప గుచ్చం ఇవ్వడానికి నిరాకరించి నాని చేసిన వివాదం కూడా కళ్ళ ముందే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు నానికి టీడీపీలో కొనసాగడం ఇష్టం లేదా అన్న వారూ ఉన్నరు. అందుకే ఆయన టీడీపీ మీద దాని విజయావకాశాల మీద ఆఫ్ ది రికార్డు అంటూ చేసిన కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులు కానీ ఆయన రాజీపడరు అని తెలియచేసేవే.
తాజాగా నాని తన ఫేస్ బుక్ లో ఒక పోస్టింగ్ పెట్టారు. అది కూడా పార్టీ మీదనే. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పినా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించినా యాక్షన్ తీసుకుంటామని విజయవాడ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ నెట్టెం రఘురాం తాజాగా తిరువూరు టీడీపీ మీటింగులో కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ తో వచ్చిన న్యూస్ కటింగుతో నాని యాక్షన్ తీసుకుంటారా లిస్ట్ పంపిస్తామని సెటైరికల్ గా సవాల్ చేస్తూ పెట్టిన పోస్టింగ్ ఇపుడు తెగ వైరల్ అవుతోంది.
నిజంగా యాక్షన్ తీసుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది అన్నదే కేశినేని భావన అంటున్నారు. ఆయన నెట్టెం రఘురాం ని ఉద్దేశించి చేసినా ఏకంగా అధినాయకత్వానికే ఈ సవాల్ చేశారు. ఆ విధంగా ఆయన యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు అని అంటున్నారు. ఈ మధ్యనే మాజీ మంత్రి దేవినేని నాని కొడాలి నానికి సవాల్ చేస్తూ తొడకొట్టడం మీద కూడా నాని సెటైర్లు వేశారు. తొడకొట్టుడుతో ఏమీ జరగదు, ఎవరూ హీరోలు అయిపోరు అంటూ నాని అన్న మాటలు కూడా మంట పుట్టించేవే. మొత్తానికి నాని తాజా పోస్టింగ్ మాత్రం ఆయన వైఖరి తెలియచేస్తోంది. ఆయన టీడీపీలో ఉంటారా అన్న డౌట్లు కూడా పెంచేస్తోంది.