దుర్గ‌మ్మ‌ను - వెంక‌న్న‌ను మోసం చేసిన‌ మోడీ

Update: 2018-02-09 10:18 GMT
ఒక్కోసారి... మోడీ హిందుత్వ వాదా? దేవుడిని న‌మ్మ‌ని బిజినెస్ మ్యానా? అన్న అనుమానం క‌లుగుతుంది. ఇది మామూలుగా అన్న‌మాట కాదు. దీనికి ఆధారాలున్నాయి. అత‌ను దేవుడి ముందు పెట్టిన ఒట్టుల‌ను కూడా ప‌ట్టించుకోడు అంటే అత‌డు దేవుడిని న‌మ్ముతాడ‌ని ఎలా అనుకోమంటారు. అవును.  నిర‌స‌న‌లు అంటే చాలు రోజుకో వేషంలో విచిత్రంగా నిర‌స‌న తెలిపే టీడీపీ ఎంపీ శివప్ర‌సాద్ ఈరోజు పోతురాజు వేషం వేశారు. స‌హ‌జంగా సినీ న‌టుడు అయిన శివ ప్ర‌సాద్‌ కు ఈ వేషాలు కొత్తేం కాదు. అయితే, ఈరోజు శివ‌ప్ర‌సాద్ చేసిన కామెంట్ మాత్రం అంద‌రినీ ఆలోచింప‌జేసింది.

మోడీ తిరుప‌తి వెంక‌న్న‌ను- బెజ‌వాడ దుర్గ‌మ్మ‌ను మోసం చేశాడు... అని శివ‌ప్ర‌సాద్ వ్యాఖ్యానించాడు. అవును...ఇందులో లేశ‌మాత్ర‌మైనా అబ‌ద్ధం లేదు. ఎన్నిక‌ల ముందు తిరుప‌తి స‌భ‌లో ఏడుకొండ‌ల వాడి పాదాల చెంత‌న మోడీ ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌కు అద్భుత‌మైన రాజ‌ధానిని క‌ట్టించే బాధ్య‌త త‌న‌దే అని మాటిచ్చాడు. పైగా తిరుప‌తి వెంక‌న్న స‌న్నిధిలో మాట్లాడుతున్నాను. ఈ మాట‌ను నెర‌వేరుస్తాను అని కూడా అన్నాడు. దీంతో పాటు ఇంకా అనేక హామీలు అపుడే ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఏడాది ఒక‌సారి చంద్ర‌బాబు కలిసిన‌పుడు కూడా ఇవేమాట‌లు అన్న‌ట్టు మీడియాలో వ‌చ్చింది. కానీ ఆ మాట‌లు అంతే. అద్భుత‌మైన రాజ‌ధాని త‌ర్వాత‌.. క‌నీసం ప‌దిశాతం నిధులు కూడా రాలేదు.

త‌ర్వాత అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు వ‌చ్చి దుర్గ‌మ్మ సాక్షిగా ఏపీకి కేంద్రం అండ‌గా ఉంటుంద‌న్నారు. కానీ ఆ హామీని కూడా తుంగ‌లో తొక్కేశారు. ఈ సంద‌ర్భంగా ఇంకో దృశ్యం కూడా చోటుచేసుకుంది. అమ‌రావ‌తి శంకుస్థాప‌న పూజ‌లో పూజారి బొట్టు పెడితే  ఒక్క  క్ష‌ణం కూడా ఉంచుకోకుండా వెంట‌నే తుడిచేశాడు మోడీ. ఆయ‌న చ‌ర్య‌కు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ త‌ర్వాత దుర్గ‌మ్మ చెంత‌న ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చ‌లేదు. అంటే మోడీ అటు వెంక‌న్న‌ను - ఇటు దుర్గ‌మ్మ‌ను ఇద్ద‌రినీ లెక్క‌చేయ‌లేదు.

*మోడీ పాపం పండింది. ఇప్ప‌టికైనా మాట‌పై నిల‌బ‌డ‌క‌పోతే వారి శాపం మోడీకి తప్ప‌దు* అని ఎంపీ శివ‌ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే... ఈరోజు శివ‌ప్ర‌సాద్ వేసిన వేషం కొంద‌రిని విస్మ‌యానికి గురిచేసింది. సోష‌ల్ మీడియాలో, నేష‌నల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అయ్యింది.
Tags:    

Similar News