తెలుగుదేశం పార్టీ వయసు నలభైఏళ్ళు. ఆ పార్టీ పుట్టుక నుంచి ఉన్న వారి వయసు సగటున ఆరు పదులు పది దాటి ఉంది. అన్న ఎన్టీయార్ పార్టీని స్థాపించినపుడు పాతికేళ్ల యువకులు అంతా టీడీపీలో చేరారు. వారే ఇప్పటిదాకా టీడీపీలో ఉంటూ పదవులు అనుభవిస్తున్నారు. వీరంతా సీనియర్ మోస్ట్ లీడర్లు అయిపోయారు. దాంతో టీడీపీ ఒక విధంగా ఓల్డెస్ట్ పార్టీ అయిపోయింది. పోటీగా ఉన్న వైసీపీలో ఎక్కువ మంది యువకులు కనిపిస్తూంటే టీడీపీ మాత్రం వృద్ధభారాన్ని అలా మోస్తూ ముందుకు సాగలేక చతికిలపడుతోంది.
అవుట్ డేటెడ్ పొలిటీషియన్స్ తో జనరేషన్స్ గ్యాప్ తో టీడీపీ ఇపుడు తెగ సతమతమవుతోంది. ఈ నేపధ్యంలో టీడీపీని కూడా యంగ్ బ్లడ్ తో నింపేయాలని నిర్ణయించుకున్నారు. కనీసంగా నలభై శాతం ఎమ్మెల్యే టికెట్లు ఈసారి యువతకు ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. తాజాగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగులో పార్టీ అగ్ర నేత లోకేష్ దీని మీద పలు కీలక సూచనలు చేశారు. పార్టీలోకి యువతరాన్ని ఆహ్వానించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
దీని మీద పూర్తి అధ్యయనానికి పార్టీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తోంది. వచ్చే పొలిట్ బ్యూరో మీటింగ్ నాటికి దీని మీద కమిటీ సమగ్రమైన నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికను అనుసరించి పార్టీలో కీలక మార్పులు ఉంటాయి. నలభై శాతం యువత అంటే కచ్చితంగా 75 మంది దాకా కొత్తవారికి టికెట్లు ఈసారి ఇస్తారన్న మాట. దాని కోసం కసరత్తు సాగుతోంది. ఈసారి మహనాడు విజయవంతం అయింది అంటే దానికి యువత ఉత్సాహమే కారణం అని పార్టీ గుర్తించింది.
ఇక రానున్న రోజుల్లో పార్టీ చంద్రబాబు నుంచి లోకేష్ కి సాఫీగా ట్రాన్స్ ఫర్ కావాలీ అంటే యువతరం పార్టీలో ఎక్కువగా ఉంటేనే సాధ్యపడుతుంది అని అంటున్నారు. యువత అంటే ఎవరు, ఏ ఏజ్ వారికి చాన్స్ ఇవ్వాలి అన్న దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. 35 నుంచి 45 ఏళ్ల మధ్య వారిని యువతగా గుర్తించి పార్టీ టికెట్లు ఇవ్వాలని, పార్టీలో కీలకమైన పదవులలో వారిని నియమించాలని కూడా ఆలోచన చేస్తున్నారు.
అలాగే పార్టీ టికెట్లు పొంది వరసగా మూడు సార్లు ఓడిపోయిన వారికి ఇక టికెట్ ఇవ్వకూడదు అని డిసైడ్ చేయనున్నారు. అదే విధంగా పార్టీ పదవులు ఎవరికైనా రెండు దఫాలే అన్న కొత్త నిబంధనను కూడా అమలు చేయనున్నారు. ఇవన్నీ చూస్తే కనుక కచ్చితంగా టీడీపీ తనను తాను తీర్చిదిద్దుకునే పనిలో పడింది అంటున్నారు. ఒక వైపు వైసీపీ యూత్ కళతో ఉంది. మరో వైపు జనసేన కూడా యువకులతో కొత్త వారితో నిండి ఉంది. టీడీపీ వృద్ధ నారి మాదిరిగా ఉంటే బండి లాగడం కష్టమన్న ఆలోచనలతోనే ఈ దిశగా అడుగులు వేస్తున్నారుట.
మొత్తానికి టీడీపీ పొలిట్ బ్యూరోలో లోకేష్ సూచనలతో సీనియర్లలో అయితే గుండె దడ మొదలైంది అంటున్నారు. పార్టీకి మీ సేవలు ఇక చాలు అని చెప్పకనే చెబుతున్నారుట. మరి దీన్ని వారు ఎలా అర్ధం చేసుకుని సహకరిస్తారో చూడాలి. అదే విధంగా యువత అంటే తమ కుమారులు, వారసులకు టికెట్లు ఇమ్మని పేచీలు పెడతారా అన్నది కూడా చూడాలి.