ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల బలాబలాలను అన్ని పార్టీలు అంచనా వేస్తుంటాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి సామాజిక వర్గాల పరంగా మెజారిటీ ఓటింగ్ అనేది కలిసివస్తుంది.. కానీ ఏపీలోని నెల్లూరు జిల్లా రాజకీయం ఇందుకు విభిన్నం. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా - ఇక్కడ మాత్రం వైసీపీదే పై చేయి.
ఇక్కడ నుంచి వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల ఆదరాభిమానాలు మెండుగా సంపాదించుకున్నారు. వీరిపై టీడీపీ తరుపున అభ్యర్థిగా నిలబెట్టేందుకు కొంచెం ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థతి నెలకొని ఉంది. నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. ఇక్కడ ఎక్కువగా ఉన్న ముస్లిం సామాజికవర్గంలో ఈయనకు గట్టి పట్టు ఉంది. గతంలో ఇక్కడ ఆనం వర్గం బలంగా ఉండేది. రామనారాణరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మినిస్టర్ గా కూడా పనిచేశారు. వివేకానంద రెడ్డి ఇటీవల మృతి చెందారు. కాంగ్రెస్ కు 2014 ఎన్నికల తరువాత రాష్ట్రంలో ప్రాబల్యం తగ్గడంతో ఇరువురు సోదరులు టీడీపీలో చేరారు. కానీ, చంద్రబాబు వీరికి ఎటువంటి పదవులు ఇవ్వకుండా దూరంగానే ఉంచారు.
ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు జగన్ హామీనిచ్చారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ కూడా వైసీపీ హస్తగతం అయ్యేలా సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు మంత్రి నారాయణ టిక్కెట్ ఆశిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈయన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా - టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ - మంత్రి అయ్యారు. ముఖ్యంగా ఆయన నెల్లూరు రాజకీయాలపైనే దృష్టి పెట్టినా - ఓ వర్గం అనేది తయారు చేసుకోలేదని వినికిడి., ప్రస్తుతం మేయర్ గా ఉన్న అజీజ్ కూడా ఇక్కడ నుంచే టీడీపీ తరుఫున టిక్కెట్ ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉండటంతో కొంచెం పోటీ ఇచ్చే అవకాశం ఉంది.,
ఇక, నెల్లూరు రూరల్ నియవజకర్గం నుంచి వైసీపీ తరుపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. ఈయనను ఢీకొట్టాలంటే కొండను ఢీకొట్టేలా పరిస్థితులు ఉన్నాయి. ఈయన ఇంట్లో కన్నా నియోజకవర్గంలో ఎక్కువ కాలం గడుపుతారనే పేరుంది.. ప్రతి ఒక్కరిని పేరు పేరుున పలకరించడం ఈయన ప్లస్ పాయింట్. గత ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కలిసి పోటీ చేయగా - ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో కోటంరెడ్డి గెలుపు సునాయసమైంది. ఇప్పటి వరకు టీడీపీ ఇన్ చార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఈయనతో కూడా సఖ్యతతో ఉంటూ ఎవ్వరికీ ఏ పని కావాలని వచ్చినా చేసి పెట్టారు. ప్రత్యేక ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు. ఈయనను ఢీకొట్టాలంటే ఆదాల ఒక్కరికే సాధ్యమని స్థానికులు భావిస్తున్నారు. ఆదాల కాకుండా మరెకవరికి ఇచ్చినా కోటంరెడ్డి విజయం ఖాయమని అంటున్నారు.
అదికార టీడీపీ ఈ సారి ఎలాగైనా జిల్లాలో పాగా వేయాలని పాచికలు వేస్తున్నా అవి పారడం లేదు. ఎమ్మెల్యేలు అనీల్ కుమార్ యాదవ్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ప్రత్యర్థులు ఎవరైనా ఓడించి గెలుపును ఖాతాల్లో వేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి నెల్లూరు కొరకరాని కొయ్యలా మారిందనడంలో సందేహం లేదు.