ఎన్నికల వేళ టీడీపీలతో కుల కలం రేగిందనే చెప్పాలి. కేవలం కులం ప్రాతిపదికననే పార్టీలో టికెట్లు దక్కుతున్నాయని - మనకు కూడా టికెట్లు దక్కాలంటే.. మన కులపోళ్లు కూడా సీఎం ముందు నిరసన గళం విప్పితేనే ఫలితం ఉటుందని - ఆ ఆందోళనలను మీడియాలో బాగా ఎక్స్ పోజ్ అయ్యేలా తాను చూసుకుంటానంటూ ఓ మహిళా నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే పెను కలకలం రేపుతున్నాయి. కులం - మతం ప్రాతిపదికలను పక్కన పెట్టేసి... కేవలం కార్యకర్తల అభీష్ఠం - పార్టీ గెలుపు ప్రాతిపదిక మీదనే టికెట్లు కేటాయిస్తున్నానంటూ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలు నిజం కాదని - టికెట్ల ఖరారు మొత్తం కూడా కేవలం కులం ప్రాతిపదిక మీదే జరుగుతోందని ఆ మహిళా నేత చెప్పేసినట్టైందన్న వాదన వినిపిస్తోంది.
ఇక ఈ సంచలన వ్యాఖ్యలు చసిన ఆ మహిళా నేత ఎవరు? ఆ నేత ఏం మాట్లాడారు? సదరు ఆడియో ఇప్పుడు రేపుతున్న కలకలం ఏమిటన్న విషయాల్లోకి వస్తే... ఓ ఏడాదిన్నర క్రితం దాకా ఎక్కడా పేరు వినిపించని సాధినేని యామినీ శర్మ... ఇటీవలి కాలంలో టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయా టీవీ ఛానెళ్లలో జరుగుతున్న లైవ్ డీబేట్లలోనూ పార్టీ తరఫున ఆమె కీలకంగానే వ్యవహరిస్తున్నారు. వైరి వర్గాలపై తనదైన శైలి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రత్యర్థులు సంధించే విమర్శలకు తట్టుకోలేక లైవ్ షోలోనే కంటతడి పెట్టుకుంటున్న తీరుతో ఆమె బాగానే పాపులర్ అయ్యారని చెప్పాలి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యామినీపై జనసేన కార్యకర్తలు పేట్రేగుతున్న తీరు కూడా సంచలనంగానే మారిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికలు సమీపించిన తరుణంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగాలని ఆమె కోరుకోవడంలో తప్పు లేదు కదా. అందుకేనేమో... తనకూ టికెట్ కావాలని భావిస్తున్న ఆమె... సీనియర్లను కాదని తనకు టికెట్ దక్కేలా చేసుకోవడం ఎలా అన్న రీతిలో తన బుర్రకు పదును పెట్టారు.
ఈ క్రమంలో ఆ బ్రహ్మాండమైన ప్లాన్ ను రచించుకున్న ఆమె... తన కులపోళ్లతో సీఎం ఎదుట ఆందోళన నిర్వహించాలని తీర్మానించుకున్నారు. ఆ ఆందోళనకు మీడియాలో బాగా హైప్ తేచ్చేయడం ద్వారా తన అవకాశాలను మెరుగుపరచుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ప్లాన్‌ను తన వారికి చేరవేసేందుకు కూడా ఆమె ఉద్యుక్తులయ్యారు. ఈ క్రమంలో తన ఫోన్ కాల్ ను ఎవరైనా ట్యాపింగ్ చేస్తారా? లేదంటే... తాను మాట్లాడే వ్యక్తులే ఈ ఆడియోను బయటకు విడుదల చేస్తే పరిస్థతి ఏమిటన్న విషయంపై పెద్దగా ఆలోచించకుండానే ఆమె ఎవరికైతే ఈ ప్లాన్‌ను చెప్పాలనుకున్నారో - వారికి ఫోన్ చేశారు. మొత్తం ప్లాన్ ను వివరించారు.
ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే... *ఇతర కులాల వాళ్లు వాళ్ల కులపళ్లతో ధర్నాలు చేయిస్తున్నారు. టికెట్లు సాధించుకుంటున్నారు. మనకూ టికెట్లు కావాలంటే మనం కూడా ఆందోళన బాట పట్టాల్సిందే. మన కులపోళ్లే సీఎం ఎదుట నినదించాలి. కనీసం ఓ 20 నుంచి 30 మంది అయినా ఆందోళన చేస్తే... ఆ ఆందోళనను మీడియాలో హైలెట్ చేయిస్తా. నాకు పరిచయం ఉన్న వారితో మాట్టాడతా. ఆ దిశగా మన అవకాశాలను మెరుగుపరచుకుందాం* అంటూ ఆమె తన ప్లాన్‌ను వివరించారు. ఆమె ప్లాన్ యాక్షన్ లోకి దిగకముందే... ఆమె ఫోన్ లో మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియో బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో టీడీపీకి కులం కంపును పూసేసినట్టేనన్న వాదన వినిపిస్తోంది. ఈ ఫోన్ కాల్ తో తన అవకాశాలను తానే చంపేసుకున్న యామినీ... టీడీపీ నుంచి ఎలాంటి చర్యలను ఎదుర్కొంటారో చూడాలి.
Full View