ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టైం ఏ మాత్రం బాగోనట్టుగా ఉంది. ఆయనకు ఎదురుదెబ్బలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అనునిత్యం ఏదో ఒక షాక్ తగులుతున్న ఆయనకు.. తాజాగా మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఒకరు పార్టీకి.. బాబు ఇచ్చిన పదవికి రాజీనామా చేసి గుడ్ బై చెప్పారు.
లోక్ సభ ఎన్నికలతో పాటు.. ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు టైం దగ్గరకు వచ్చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. టీడీపీకి చెందిన పలువురు నేతలు పార్టీకి చెల్లుచీటి ఇచ్చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పగా.. తాజాగా ఆ జాబితాలో కర్నూలు జిల్లా సీనియర్ నేత.. ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇష్టపూర్వకంగా తాను రాజీనామా చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా లేఖలో తెలిపారు. త్వరలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.