ఏపీ ప్రతిపక్ష నేత - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ ఎలా ముందుకు సాగుతుందో మరోమారు తేటతెల్లయింది. ఏకంగా టార్గెట్ జగన్ పేరుతో ఓ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో జగన్ ను మరింతగా ఇరకాటంలో పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వ్యూహాత్మక అడుగులు వేస్తూ 40 మంది దూకుడు ఎమ్మెల్యేలను ఎంచుకుంది. వారికి గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అవగాహన కల్పించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు - తొలిసారిగి ఎమ్మెల్యేలైన పలువురును టీడీపీ అధిష్టానం పిలిపించింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ఆరోపణలను ఏ రకంగా తిప్పికొట్టాలనే విషయమై సీనియర్ ఎమ్మెల్యేలు తమ విశ్లేషణలను, అనుభవాన్ని వివరించారు. బడ్జెట్‌తో పాటు ఆయా నియోజకవర్గ ప్రజాసమస్యలే అజెండాగా పరిష్కారానికి తీసుకున్న చొరవ, తదితర వివరాలతో సిద్ధం కావాలని కొత్త ఎమ్మెల్యేలకు సూచించారు. సీనియర్ ఎమ్మెల్యేలు బడ్జెట్ పై వైసీపీతో ఎదురుదాడికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. స్థానిక సమస్యల ప్రస్తావన వచ్చినప్పుడు సంబంధిత మంత్రుల వివరణతో పాటు ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించాలని సూచించారు. ఇలా రాష్ట్రంలోని 40 మంది ఎమ్మెల్యేలను సుశిక్షితులుగా చేసి అంశం ఏదైనా జగన్ పై దూకుడుగా సాగడమే ఎజెండా అని డిసైడ్ చేసేశారు. అయితే సమావేశం జరుగుతుండగానే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందినట్లు సమాచారం అందడంతో అర్ధంతరంగా ముగించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/