మ‌ళ్లీ అదే ర‌గ‌డ‌.. ప‌ల్నాడులో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ!

Update: 2022-12-16 17:12 GMT
ఏపీలో మ‌రోసారి టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చింది. టీడీపీ చేప‌ట్టిన ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రాని కి కార్య‌క్ర‌మాన్ని ప‌ల్నాడు జిల్లాలోని కొంద‌రు టీడీపీ నాయ‌కులు చేప‌ట్టారు. అయితే.. దీనిని అడ్డుకునేం దుకు వైసీపీ నాయ‌కులు కూడా రెడీ అయ్యారు. దీంతో ఇరు వ‌ర్గాల  మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుం ది. అంతేకాదు.. క‌ర్ర‌లు, రాళ్ల‌తో ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నాయి. దీంతో ప‌ల్నాడు మ‌రో సారి ర‌ణ‌రంగంగా మారిపోయింది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపు మేర‌కు ప‌ల్నాడులోని గుర‌జాల‌, వినుకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌లు ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో కొన్ని పోస్ట‌ర్లు స‌హా ఫ్లెక్సీల‌ను కూడా క‌ట్టారు. అయితే, ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అధికారులు వాటిని తొల‌గించారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో పోటా పోటీగా వైసీపీ నాయ‌కులు గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హించారు. దీనికి సంబంధించి కొంద‌రు ప్లెక్సీలు క‌ట్టారు.

అయితే, టీడీపీ క‌ట్టిన బ్యాన‌ర్లు, ఫ్లెక్సీల‌ను తొల‌గించి.. కేవ‌లం వైసీపీ వారివి ఉంచ‌డం వివాదానికి దారితీసింది. దీనిని ప్ర‌శ్నించిన టీడీపీ నేత‌ల‌పై కొంద‌రు వైసీపీ నాయ‌కులు దాడులు చేశారు. దీంతో ప్ర‌తిగా టీడీపీ నాయ‌కులు కూడా ఎదురు దాడికి దిగారు. దీంతో క‌ర్ర‌లు, రాళ్ల‌కు ఇరు వ‌ర్గాలు ప‌నిచెప్పాయి.

ఈ విష‌యం ముందుగానే ఊహించిన పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని..ఇరు వ‌ర్గాల‌ను శాంతింప‌జేసే ప్ర‌య‌త్నం చేసినా.. ఫ‌లించ‌లేదు దీంతో చెద‌ర‌గొట్టారు. అయితే.. ఇలా రెండు పార్టీలు.. ఒక‌రిపై ఒక‌రు ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌డంతో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News