వైసీపీ సునామీ...వార‌సత్వానికి బ్రేక్‌

Update: 2019-05-24 07:02 GMT
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ విక్ట‌రీలో ప్ర‌ధానంగా న‌ష్ట‌పోయింది...రాజ‌కీయ ఉద్దండుల‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏపీలో ఎన్నికల ఫలితాలను తీక్షణంగా చూస్తే ఇప్పటి వరకు రాజకీయ ఉద్దండులుగా ఉన్న వారికి ఘోర ప‌రాజ‌యం ఎదురైంది. మ‌రోవైపు ముఖ్య‌నేత‌ల వార‌సులంతా...చాప‌చుట్టేశారు. ప్రాంతాల‌తో సంబంధం లేకుండా ఈ ట్రెండ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని...ఓట‌మిని విశ్లేషించిన స‌మ‌యంలో తెలుస్తోంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ ఓట‌మి పాల‌య్యారు. రాయల‌సీమ‌లో కీల‌క‌మైన అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి కంచుకోట అయిన రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ ఓటమి పాల‌య్యారు. గెలవడం తప్ప ఓటమి రుచి చూడని జేసీ ఫ్యామిలీ తొలిసారి ఓటమి బాట పట్టింది. మొదటిసారి పోటీ చేసిన జేసీ వారసులిద్దరూ కూడా ఓడిపోయారు. అనంతపురం లోక్‌ సభ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ పవన్ - తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి జేసీ అస్మిత్ లు ఘోర పరాజయం పాల‌య్యారు. మంత్రి భూమా అఖిలప్రియకు సైతం ఈ ఎన్నికల్లో చుక్కెదురయింది.

మ‌రోవైపు ఉద్ధండులైన రాజ‌కీయ నాయ‌కుల‌కు షాక్ త‌ప్ప‌లేదు. 1999 నుంచి వరుస విజయాలు సాధిస్తున్న మంత్రి దేవినేని ఉమ తొలిసారి ఓటమి పాలయ్యారు. ఇక కర్నూలు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న కేఈ ఫ్యామిలీ ఈసారి ఓడిపోయింది. పొన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ధూళిపాళ్ల నరేంద్రకు డబుల్ హ్యాట్రిక్ మిస్ అయ్యేలా ఉంది. ఇక 1996 ఉప ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఓటమి ఎరగని మంత్రి అమర్‌ నాధ్ రెడ్డి ఓటమి బాటప‌ట్టారు.
Tags:    

Similar News