ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగా క్రూరంగా చంపేసిన రామ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. స్వాతి హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటం.. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చెన్నై పోలీసులు అన్ని కోణాల్లో విచారించి నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు విపరీతంగా కష్టపడ్డారు. సినిమాటిక్ గా.. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా.. అప్రమత్తంగా వ్యవహరిస్తూ నిందితుడు రామ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న రామ్ కుమార్.. తాను స్వాతిని ఎందుకు చంపిన విషయాన్ని చెప్పటంతో పాటు.. రైల్వేస్టేషన్ లో స్వాతిని హత్య చేసిన తర్వాత తానేం చేసింది చెప్పుకొచ్చాడు. జూన్ 24న హత్య చేసిన తర్వాత తన సొంతూరు సెంగోట్లై మీనాక్షిపురానికి వెళ్లిపోయాడు. రామ్ తండ్రి పరమశివన్ బీఎస్ ఎన్ ఎల్ లో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి పుష్పం ఇంటి బాధ్యతల్ని చూస్తుంటుంది.
రామ్ కు ఇద్దరు సిస్టర్స్. వారిలో బాలా (20).. కాళీశ్వరి (19). వీరిద్దరూ రామ్ కంటే చిన్నవాళ్లే. హత్య చేసిన తర్వాత ఇంటికి వెళ్లిన రామ్ కుమార్.. ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ రోజూ పొలం పనులకు వెళ్లటం గమనార్హం. పొలం పనులు లేని పక్షంలో ఊరికి దూరంగా మేకల్ని మేతకు తీసుకెళ్లేవాడు. స్వాతి హత్యకు సంబందించిన వార్తల్ని చదవటం.. టీవీల్లో వార్తలు ఆసక్తిగా చూసేవాడట. పగటి పూట ఇంట్లో ఉన్నా.. రాత్రిళ్లు పడుకోవటానికి మాత్రం దగ్గర్లోని మేకల ఉంచిన ప్లేస్ లో పడుకునేవాడట.
రామ్ వైఖరిపై సందేహాలు వచ్చి.. అతడి తల్లిదండ్రులు ప్రశ్నించినా.. సమాధానం చెప్పకుండా తప్పించుకునేవాడని.. మౌనంగా ఉండేవాడని చెబుతున్నారు. పేపర్లో వచ్చిన ఫోటోలు.. వివరాలు ఆధారంగా తమ కొడుకు మీద సందేహం వచ్చినట్లుగా చెబుతున్నారు. తమ కొడుకును పోలీసులు అరెస్ట్ చేస్తారని మానసికంగా సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకునే సమయంలో ఉలిక్కిపడి.. ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే.. రామ్ కుమార్ హత్య చేశారన్న విషయాన్ని ఆ ఊళ్లో వారు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. మౌనంగా.. తన పని తానుచేసుకుంటూ పోయే వ్యక్తి.. ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడా? అంటూ ఆసక్తిగా చెప్పుకున్నట్లు చెప్పుకుంటున్నారట.