తీన్మార్ మల్లన్న పై బీజేపీ సీరియస్? కేసు పెట్టిన కేటీఆర్..?

Update: 2021-12-25 11:30 GMT
ఒకరిని వ్యక్తిగతంగా తిట్టడం వరకూ ఒకే.. కానీ వారి రూపు రేఖలను తిట్టడం అంటే అది జాత్యంహంకారమే.. బాడీ షేమింగ్ పెద్ద నేరం. పైగా అది పిల్లలపై చేస్తే దాన్ని మించిన దారుణం మరొకటి ఉండదు. సామాన్య జనం నుంచి పార్టీ నేతల వరకూ ఇప్పుడు దీన్ని ఖండిస్తున్నారు. తాజాగా బీజేపీలో ఇటీవలే చేరిన తీన్మార్ మల్లన్న వ్యవహారశైలి ఆ పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోంది.

తీన్మార్ మల్లన్న విషయంలో బీజేపీకి ఇరుకునపడుతోందన్న ప్రచారం సాగుతోంది. కేసీఆర్ ఫ్యామిలీని వ్యక్తిగతంగా తిడుతున్న ఆయన వ్యవహారం ఇప్పుడు బూమరాంగ్ అవుతోంది. బీజేపీకే దెబ్బ పడుతోంది.

తీన్మార్ మల్లన్న తాజాగా మంత్రి కేటీఆర్ కుమారుడిపై చేసిన వ్యక్తిగత కామెంట్లు దుమారం రేపాయి. అభివృద్ధి విషయమై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న తాజాగా వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘అభివృద్ధి ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా?’ అనే అర్థం వచ్చేలాగా ట్విట్టర్ లో తీన్మార్ మల్లన్న పోస్టు పెట్టాడు.

అయితే పాలిటిక్స్ లోకి ఫ్యామిలీని లాగడంపై అందరూ తప్పుపడుతున్నారు. పైగా ఏమాత్రం సంబంధం లేని చిన్న పిల్లలను టార్గెట్ చేయడం ఏంటని.. ఇది పెద్ద తప్పు అని అందరూ ఖండిస్తున్నారు. బాడీ షేమింగ్ చేయడం మహానేరం అంటున్నారు. పైగా అది పిల్లలపైనా ప్రతాపం చూపిస్తోందంటున్నారు.

ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు మంత్రి కేటీఆర్. తన కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ ఏసీపీకి టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం ఫిర్యాదు చేసింది. ఇప్పటికే హిమాన్షుపై ట్వీట్ చేసిన తీన్మార్ మల్లన్నపై పలువురు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.

ఇక తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం కూడా ఆరాతీస్తోంది. కేటీఆర్ కుటుంబ సభ్యులను విమర్శించడంపై సీరియస్ గా ఉంది. తీన్మార్ మల్లన్నకు వార్నింగ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. వ్యక్తిగత విమర్శలు తమ పార్టీ సిద్ధాంతం కాదంటున్నారు బీజేపీ నేతలు. మరి మల్లన్నపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచిచూడాలి.


Tags:    

Similar News