ఇటీవల చిన్నపిల్లల్లో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండటంతో పిల్లలు ఎక్కువగా ఫోన్, ల్యాప్‌టాప్‌ను వాడుతున్నారు. అయితే కరోనా ప్రభావం మొదలయ్యాక ఇంటర్నెట్ వాడకం మరింత పెరిగింది. అన్ని స్కూళ్లు ఆన్లైన్లోనే పాఠాలు చెబుతుండటంతో తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ కొనిచ్చారు. ఉన్నతవర్గాల వాళ్లు మాత్రమే కాక.. పేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా పిల్లలకు ఫోన్లు, ల్యాప్టాప్స్ కొనిచ్చారు. ఇది ఎంతో ప్రమాదం అని అంటున్నారు నిపుణులు..
చిన్నపిల్లలకు ముఖ్యంగా టీనేజ్ పిల్లలు అతిగా ఫోన్, ఇంటర్నెట్ వాడితో వాళ్ల ఆరోగ్యం చెడిపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వాళ్లు మానసికంగా కూడా ఎన్నో అవస్థలు పడతారని చెబుతున్నారు. ముఖ్యంగా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టీనేజ్ పిల్లల ఇంటర్నెట్ వాడకంపై ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ అధ్యయనం చేసింది.. ఈ అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. కౌమరదశ పిల్లలు.. ముఖ్యంగా పదహారేళ్ల వయసున్నవారు ఇంటర్నెట్‌కు బానిలలవుతున్నారని ఆ సర్వేలో తేలింది. ఇంటర్నెట్ అతిగా వాడటం వల్ల పిల్లలో ఒంటరితనం పెరుగుతుందని.. డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
16, 17, 18 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల ఇంటర్నెట్ వినియోగంపై అధ్యయనం చేశారు. అయితే పిల్లలు ఆన్లైన్ క్లాసులతో పాటు సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలవుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఇది ఎంతో ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చిన్నవయసులోనే సోషల్‌మీడియాకు బానిసలు కావడం వల్ల మానవసంబంధాలు దెబ్బతింటాయని.. డిప్రెషన్ వస్తుందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలను ఓ కంట కనిపెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు .