శివసేన నుంచి మరో టైగర్ ఎంట్రీనా?

Update: 2019-10-11 10:38 GMT
మహారాష్ట్ర పులులు.. శివసేన పార్టీ అధినేతలు అయిన ఠాక్రే కుటుంబంలో మరో తరం రాజకీయాల్లోకి వస్తోంది. ఠాక్రే వారసులు మొదటిసారి ఈ మహారాష్ట్ర ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

శివసేన స్థాపించిన బాల్ థాకరే.. ముఖ్యంగా మహారాష్ట్ర వాసులు - మరాఠీల సంక్షమమే లక్ష్యంగా పార్టీని నడిపించారు. ఆయన మరణం తరువాత ఆయన కుమారుడు ఉద్దవ్ ఠాక్రే ప్రస్తుతం శివసేన అధ్యక్షుడిగా ఉన్నారు.

ఇప్పుడు ఠాక్రే కుటుంబానికి చెందిన మూడో తరం యువనేత .. శివసేన యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే రాజకీయాల్లోకి వచ్చారు. వర్లీ నియోజకవర్గం నుంచి ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఇప్పుడు ఆయన తమ్ముడు తేజస్ ఠాక్రే కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. అయితే ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా గెలిచాక యువసేన బాధ్యతలు తేజస్ కు అప్పగిస్తారని సమాచారం.

ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి తేజస్ ఎన్నికల సభల్లో పాల్గొని తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇప్పుడు చిన్న కుమారుడు తేజస్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయనుండడం ఆసక్తి రేపుతోంది.

అయితే తేజస్ రాజకీయాల్లోకి వస్తున్నాడన్న వార్తలను ఉద్దవ్ ఠాక్రే ఖండించాడు. జంతు ప్రేమికుడైన తన కొడుకు ఎన్నికల ర్యాలీలను చూసేందుకు మాత్రమే వచ్చాడని.. ఎప్పుడూ అడవుల్లోనే ఉండే అతడు రాజకీయాల్లోకి రాడని స్పష్టంచేశారు.
Tags:    

Similar News