గ‌వ‌ర్న‌ర్ కాదు.. ప్ర‌జ‌ల‌కే ధ‌న్య‌వాదాలు: మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌లు

Update: 2023-02-04 21:52 GMT
తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో రెండో రోజు.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై బ‌డ్జెట్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు చెప్పే తీర్మానం సంద ర్భంగా.. మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``గ‌వర్నర్ కి ధన్యవాదాలు తెలపడం అంటే, ఇంతటి అభివృద్ధికి కారణమైన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకోవడమే తప్ప మరోటి కాదు. తెలంగాణ ఈ స్థాయికి ఎదిగడానికి, ఇంతటి ఘనతకు కారణమైన నాటి తెలంగాణ ఉద్యమాన్ని.. అనంతర కాలంలో తెలంగాణ ప్రగతిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క వర్గాన్ని, వారి కృషిని గుర్తుచేసుకోవడాన్ని కర్తవ్యంగా భావిస్తున్నాను`` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.    

ఎనిమిదన్నరేండ్ల తెలంగాణ స్వయం సుపరిపాలనను, దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఈ సందర్భంగా చర్చించుకోవడానికి గొప్ప అవ‌కాశ‌మ‌న్నారు. స్వరాష్ట్రంగా తెలంగాణ అత్యుతన్నత శిఖరాలను అధిరోహించడానికి సిఎం కేసీఆర్ చేసిన కృషిని, తెలంగాణలోని సబ్బండ వర్గాలు అందించిన సహకారాన్ని రాష్ట్రం ముందు ఉంచేందుకు త‌న‌కు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

పదేళ్లు కూడా దాటని పసిబిడ్డ తెలంగాణ ఇవాళ యావత్ దేశానికే దారిచూపే దీపస్తంభంగా మారిందన్నారు. నాటి తెలంగాణ... ఉద్యమ శాస్త్రానికి టీచింగ్ పాయింట్ అయితే నేటి సముజ్వల తెలంగాణ... ఉత్తమ పాలనలో దేశానికే టీచింగ్ పాయింట్ – టాకింగ్ పాయింట్ అయింద‌ని కేటీఆర్ అన్నారు. గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పే ఈ తీర్మానంలో.. 9 ఏళ్ల ఉజ్వల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

``యావత్ తెలంగాణ సమాజం.. ఉద్యమంలో ఎట్లయితే నాటి ఉద్యమ రథసారథి సిఎం కేసీఆర్ వెంట నడిచిండ్రో.. ఈ ఎనిమిదన్నరేండ్ల కాలంలో కొనసాగిన ప్రగతి ప్రస్థానంలో కూడా అదే ఉద్యమ స్పూర్తితో సిఎం కేసీఆర్ వెంట అడుగులో అడుగు వేస్తూ వస్తున్నరు. అప్రతిహతంగా సాగుతున్న ప్రగతి యజ్జంలో భాగస్వాములైన ప్రతి వొక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపకుంటున్నాను`` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News