బీసీలపై బీజేపీ ఆశలు

Update: 2018-09-09 10:12 GMT
అధికారం మాదే అంటే మాదే అంటూ టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పార్టీలు జబ్బలు చరుస్తుంటే బీజేపీ ఇంకా తమ అభ్యర్థుల విషయంలో 15వ తేదీ వరకు వేచి చూస్తామనడంతో పార్టీ వర్గాల్లో కొత్త టెంక్షన్ మొదలైంది. ఎవరికి టికెట్ దక్కుతుందోనని అభ్యర్థులు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. అయితే... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కా వ్యూహంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించడం లో కొన్నిరోజులు వేచి చూస్తుండటం చూస్తుంటే ఇప్పటికే దేశం అంతటా విస్తరిస్తున్న బీజేపీ తెలంగాణలోనూ తమ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలపై భారీ బహిరంగ సభలో పేర్కొననున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ జెండాను తెలంగాణ లో ఎగురవేసేందుకు ఇప్పటికే తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి టీజేఎస్ పార్టీతో చర్చలు జరిపారు.
   
బీజేపీ - ఎంఐఎం బలంగా ఉన్న స్థానాల్లో టీఆర్ ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించక పోవడం చూస్తుంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందేమో అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.  బీజేపీ తమ అభ్యర్థులపై జాబితాను అమిత్ షా సభ తర్వాత ప్రకటించాలనుకోవడం చూస్తుంటే పక్కా వ్యూహంతో బీజేపీ వస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. 15వ తేదీలోపు సభ ఏర్పాటు చేసి అభ్యర్థులను కూడా అదే సభలో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
   
మరోవైపు బీసీలకు అధిక టిక్కెట్లు ఇచ్చే వ్యూహాన్ని బీజేపీ అనుసరించనుననట్లు తెలుస్తోంది. తెలంగాణలో 50శాతానికిపైగా ఉన్న ఉన్న బీసీలపై ప్రాధాన్యం ఇస్తే పార్టీకి ఓట్లు రాలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 119స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పినప్పటికీ పొత్తు పెట్టుకుంటే అధికారం లోకి వచ్చే అవకాశం ఉండటంతో బీజేపీ పలు వ్యూహాలను రచిస్తోంది. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు టికెట్టు కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Tags:    

Similar News