పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు రోజురోజుకి మరింత ఎక్కువ అవుతున్నాయి. దీనిపై ఇప్పటికే కేంద్రం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ కూడా ముస్లిములు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే, వారి ఆందోళనలకి దీటుగా బీజేపీ నేతలు కూడా సీఏఏకి మద్దతు గా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, సీఏఏకి మద్దతుగా నిర్వహించే కొన్ని కార్యక్రమాలలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి కొందరు అయితే , ఏకంగా మేము అధికారం లో ఉన్నాం కదా. ఎవరూ ఏమీ చేయలేరనే లెక్కలేని తనమో, లేక ఉచిత ప్రచారం పొందాలనే యావో తెలియదు.
తాజాగా తెలంగాణ బీజేపీ నేత నోరు పారేసుకున్నాడు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. మోడీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై అవాకులు చెవాకులు పేలాడు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ల తలలు నరికేందుకు కత్తి పట్టాలంటూ ఆయన బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. దీనితో ఒక్క సారిగా సభా ప్రాంగణం మొత్తం నిశబ్దంగా మారింది.
అయితే , ఎవరెలా ఉన్నా,రఘునందన్ మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించాడు. సీఏఏకు వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గల్లీ తీర్మానాలతో కేంద్రాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డాడు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఉడత ఊపులకు భయపడేందుకు కేంద్రంలో ఉన్నది రాజీవ్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు కావని అన్నాడు. కాగా రఘునందన్ రావుపై ఇటీవల ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయడంతో సొంత పార్టీ ఆయన్ను పక్కన పెట్టినట్టు తెలిసింది. తాను నిర్దోషిగా నిరూపించుకున్న తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని స్వయంగా ప్రకటించిన రఘునందన్, తాజాగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే, కేవలం తన ఉనికి చాటుకునేందుకే ఆయన తలలు నరుకుతాం లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటాడని కొంతమంది సొంత పార్టీ నేతలే చెప్తున్నారు.