భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి తెలుగు రాష్ట్రాల కమలనాధులు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. స్థానిక నాయకత్వంతో సంప్రదింపులు చేయకుండా ఎవరి పడితే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ తమపై పెత్తనం చేయించాలనుకుంటున్న బీజేపీ అధిష్టానానికి జవాబు చెప్పాలనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ మందస్తు ఎన్నికల్లో కేవలం నెల రోజుల ముందు శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వనించారు.ఆయనకు కండువా కప్పి తెలంగాణలో ప్రచార బాధ్యతలు సైతం అప్పగించారు. అయితే, పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీలో చేరడం కాని, ఆయన చేరుతున్నారన్న కనీస సమాచారం కాని తెలంగాణ బీజేపీ నాయకులకు తెలియదంటున్నారు. దీంతో ఆయన చేరికపై తెలంగాణలో సీనియర్ నాయకులు సైతం మౌనం వహించారే తప్ప ఏం మాట్లాడలేదు. పార్టీలో ఎన్నాళ్ల నుంచో ఉన్న వారిని పక్కన పెట్టి ఓ స్వామికి అధికారాలు కట్టబెట్టడంపై తెలంగాణ కమలనాథులు లోలోపల భగ్గుమన్నారు.
స్వామి పరిపూర్ణానంద కూడా తెలంగాణలో ప్రచారం సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులను పట్టించుకోలేదని అంటున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 118 స్ధానాల్లో పోటీ చేస్తే వంద స్ధానాల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. ఒకే ఒక్క స్ధానంలో గెలిచిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తన ఉనికే ప్రశ్నార్ధకంగా మార్చుకుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీనికి కారణం తమను కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికీ.... అది కూడా పీఠాధిపతులకు, మఠాధిపతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే తెలంగాణ బీజెపీ నాయకులు అంటున్నారు. దీన్ని ద్రష్టిల్ో పెట్టుకుని రానున్న లోక్‌సభతో పాటు ఇతర ఎన్నికల్లో ఈ స్వాములను, పీఠాధిపతులను, మఠాధిపతులను పక్కన పెట్టాలని అధిష్టానానికి సూచిస్తున్నారంటున్నారు. పార్టీకి మరింత చేటు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హితవు పలుకుతున్నారంటున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే.... ప్రవచనాలకు ఓట్లు కూడా రాలవని భారతీయ జనతా పార్టీ నాయక గణం అధిష్టానానికి స్పష్టం చేయనుందంటున్నారు