తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు తమదైన శైలిలో షాకిచ్చారు. వినతిపత్రానికి ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చిన వారు.. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మెరుపు ధర్నా చేయటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి ఉన్న వేళ.. ఛలో సెక్రటేరియట్ పిలుపునివ్వటం.. ఆ సందర్భంగా ఆందోళన చేసే రాజకీయ పక్షాల్ని సచివాలయానికి కిలోమీటర్ల ముందే పోలీసు బలగాలు అడ్డుకోవటం.. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం తెలిసిందే.
ఇలాంటి లొల్లి ఏమీ లేకుండా.. బీజేపీ నేతలు తమదైన శైలిలో తెలంగాణ సర్కారుకు షాకిచ్చారు. ఎలాంటి ప్రకటన లేకుండా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో భద్రతా వర్గాలు ఉలిక్కిపడేలా చేశారని చెప్పాలి. రైతుల సమస్యల్ని పరిష్కరించటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. కేంద్రం అందిస్తున్న నిధులను రైతులకు సరిగా అందించటం లేదని ఆరోపిస్తూ.. బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. సీనియర్ నేతలు సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు.
ఈ సందర్భంగా రైతల సమస్యలపై వినతి పత్రాన్ని అందించి వివిధ అంశాలపై వారితో మాట్లాడారు. దాదాపు గంటకు పైనే వీరి భేటీ సాగింది. కమలనాథులు వేసిన ప్రశ్నలకు సీఎస్ నుంచి సంతృప్తికర సమాధానం రాలేదన్న వాదనతో.. బయటకు వచ్చిన బీజేపీ నేతలు.. అప్పటికప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాలని నిర్ణయించి.. ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు. రైతాంగ సమస్యల్ని పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయటం మొదలు పెట్టేసరికి.. భద్రతా దళాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి.
ఊహించని పరిణామానికి వారంతా బిత్తర పోయారు. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట తెలంగాణ బీజేపీ నేతలు చేపట్టిన ధర్నాకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పెద్ద ఎత్తున పోలీసుల్ని రప్పించి.. వారిని పోలీసు వాహనాల్లో అరెస్ట్ చేసి బయటకు తరలించారు. ఊహించని రీతిలో చేసిన మెరుపు ధర్నా తెలంగాణ ప్రభుత్వానికి.. అధికారులకు ఒకలాంటి షాకిచ్చిందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/