సాధారణంగా ఎవరైనా మనకు మేలు చేసే మాట చెప్పినట్లయితే.. మన పల్లెల్లో ‘నీ నోట్టో చక్కెర బొయ్య’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఆ సామెత ప్రకారం చూసినప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు ‘కేసీఆర్ నోట్లో చక్కెర బొయ్య’ అంటూ లోపల్లోపల ఆనంద పడుతూ ఉంటారంటే అతిశయోక్తిలాగా అనిపిస్తుంది. అవును అలాంటి అవకాశం మెండుగా ఉంది.. ఎందుకంటే.. తన నోటీ దురుసు కొద్దీ మోడీ గురించి ఇష్టం వచ్చినట్టుగా ఏక వచనంలో అవమానకరంగా మాట్లాడేసిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ పార్టీ నాయకులకు ఒక మంచి అవకాశం ఇచ్చారు.
కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణలోని ఏ భాజపా నాయకుడు కూడా వదిలిపెట్టదలచుకున్నట్టు లేదు. వెంటనే అందిపుచ్చుకున్నారు. కేసీఆర్ దేశాన్ని అవమానించాడు - దేశ ప్రజలంతా క్షోభిస్తున్నారు. మోడీని ఏకవచనంలో మాట్లాడినందుకు దేశ ప్రజలందరూ విలపిస్తున్నారు.. అంటూ ఎడాపెడా విమర్శించేస్తూ.. తద్వారా మోడీ భజన చేయడానికి తె-భాజపా నాయకుడు ఎగబడుతున్నారు.
కేసీఆర్ రైతు సమితుల సమావేశంలో.. ‘మోడీగాడికి 20 సార్లు జెప్పిన’... ‘మద్దతు ధర పెంచితే నీ అయ్య ముల్లె పోతందా’ అంటూ తీవ్రంగా మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడినుంచి తెలంగాణ భాజపా నాయకులకు పండగ పండగగా ఉంది. మోడీని ఎలా భజన చేయాలా సరైన పాయింటు లేదే అని ఇన్నాళ్లూ వాళ్లలో వాళ్లు కుమిలిపోతున్నారు. అలాంటిది.. ఈ కేసీఆర్ మాటల రూపంలో వారికి అవకాశం వచ్చింది.
ఒకవైపు ఏపీ సర్కారుతో ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో విభజన హామీల ముసుగులో కేంద్రం మరియు మోడీ భజన చేయడానికి ఏపీలోని భాజపా నాయకులకు పుష్కలమైన అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు మాత్రం భజన అవకాశాలు దక్కడం లేదని బాధ పడుతున్న తెలంగాణ భాజపా నాయకులకు కేసీఆర్ మాటలు వరప్రసాదినిలా కనిపించాయి.
వాటిని పట్టుకుని గవర్నరుకు ఫిర్యాదు చేయడమూ - ప్రెస్ మీట్ లలో రెచ్చిపోవడమూ - కేసీఆర్ జాతి గౌరవాన్ని మంటగలిపేశారని తూలనాడడమూ చాలా చేస్తున్నారు గానీ.. తెలంగాణ భాజపా నాయకులు మాత్రం.. కేసీఆర్ తమకు చాలా చాలా మేలు చేశాడని అనుకుంటున్నారట. లేకపోతే ఇలాంటి భజన చాన్సు మరొకటి వచ్చి ఉండేది కాదని అనుకుంటున్నారట.