తెలంగాణ‌లో బీజేపీ అదిరిపోయే స్కెచ్‌

Update: 2016-10-28 09:05 GMT
డెవ‌ల‌ప్ కావాల‌ని ఎవ‌రు మాత్రం కోరుకోరు చెప్పండి. పొలిటిక‌ల్ పార్టీ అయినా.. పొలిటిక‌ల్ నేత అయినా.. దీనికి యాంటీ కాదుక‌దా! ఇప్పుడు తెలంగాణ‌లో బీజేపీ ఇదే ప్లాన్‌ తో రెడీ అయిపొయింది. తెలంగాణ‌లో బీజేపీ భ‌విష్య‌త్తులో అధికార‌మే ధ్యేయంగా పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టిక‌ప్పుడు రెడీ చేసిన ఈ స్కెచ్‌ ను పూర్తిగా అమ‌లు చేసేస్తే.. తాము భావిస్తున్న‌ట్టుగా తెలంగాణ‌లో అధికార ప‌గ్గాలు అందుకోవ‌డం ఏమంత క‌ష్టం కాద‌ని కూడా చెప్పేస్తున్నారు క‌మ‌లం నేత‌లు. మ‌రి వీళ్ల ప్లాన్ ఏంటో చూద్దాం.. ఆ ప్లాన్ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో తెలుసుకుందాం..

చిన్న‌రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విక‌సించాల‌నేది క‌మ‌లం పార్టీ ప్లాన్‌. ఆ క్ర‌మంలోనే తెలంగాణ విభ‌జ‌న‌కు మొద‌టి నుంచి మ‌ద్ద‌తిచ్చింది. ఇప్పుడు రాష్ట్రం సాకార‌మై రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయింది. అయితే, అనుకున్న ల‌క్ష్యం మేర‌కు క‌మ‌ల వికాసం జ‌రిగిందా? అంటే అంతంత మాత్ర‌మే అనే ఆన్స‌ర్ వ‌స్తోంది. దీనిని అధిగ‌మించేందుకు, పూర్తిస్థాయిలో రెక్క‌లు విప్పుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. రాష్ట్రంలోని 12 ఎంపీ - 75 ఎమ్మెల్యే స్థానాల్లో క‌మలం విక‌సించేలా చేయాల‌ని ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసేసింది. మ‌రి ప్లాన్ ఉంటే చాల‌దుగా.. ఎలా చేయాలో కార్యాచ‌ర‌ణ కూడా ఉండాలి. మ‌రి దానిని కూడా సిద్ధం చేశారు. టీ బీజేపీ నేత‌లు. రాష్ట్రంలో ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ ఎక్క‌డెక్క‌డ బ‌ల‌హీనంగా ఉందో ముందు గుర్తించి.. అక్క‌డ‌క్క‌డ బీజేపీ ప‌ట్టు సాధించేలా ప్లాన్ వేస్తున్నారు.

 అదే సమయంలో కాంగ్రెస్ లో ఉన్న శక్తిమంతులైన నేతలను గుర్తించి వారిని బీజేపీకిలోకి ఆకర్షించేందుకు ప‌క్కా స్కెచ్ వేస్తున్నారు. మొత్తం  75 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో.. బ‌ల‌మైన నేత‌ల‌ను గుర్తించి ఇన్‌ చార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇది ఇంత వ‌ర‌కు పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం. ఇక‌, బ‌య‌ట వ్య‌వ‌హారంపైనా నేత‌లు బాగానే ప్లాన్ చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తూనే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి జ‌రుగుతున్న మేళ్ల‌ను ఏక‌రువు పెట్ట‌నున్నార‌ట‌.

 కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ఎంత మేర‌కు నిధులు ఇస్తోంది. ఎన్నెన్నిప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. వాటిని కేసీఆర్ ఎలా వాడుకుంటున్నారు. వంటి అంశాల‌ను పూస‌గుచ్చిన‌ట్టు ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని తెలంగాణ క‌మ‌ల ద‌ళం నిర్ణ‌యించింది. ఫ‌లితంగా తెలంగాణ‌లో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్‌ కి బీజేపీ మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయం అన్న విధంగా ప‌రిస్థితిని మార్చాల‌ని చూస్తున్నారు. మ‌రి ఇది ఎంత వ‌రకు వ‌ర్క‌వుట్ అవుతుందో? క‌మ‌లం ఏమేర‌కు విక‌సిస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News