ఏమీ లేనప్పుడే.. తెలంగాణ బీజేపీ ఎగిరెగిరి పడుతోందా? ఇక, రేపు అన్నీ వస్తే.. ప్రజలు భయం గుప్పిట్లో బతకతప్పదా? ఇదీ..ఇప్పుడు.. మేధావుల నుంచి సామాన్యుల వరకుతొలిచేస్తున్న ప్రధాన ప్రశ్న. తెలంగా ణలో అధికారంలోకి వస్తామని.. వచ్చి తీరుతామని.. చెబుతున్న కమలం పార్టీ నాయకులు... దానికి అనుగుణంగా ప్రజలను తమవైపు మలుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ పరిణామాలు మాత్రం ఎలా ఉన్నా.. విపరీత పరిణామాల దిశగా అయితే.. నాయకులు అడుగులు వేస్తున్నారు.
ఒకరి తర్వాత.. ఒకరు.. అన్నట్టుగా.. నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు.. బీజేపీ ముసుగును తీసేస్తున్నట్టుగా నే భావించాల్సి ఉంటుందని మేధావులు అంటున్నారు. ఇప్పుడిప్పుడే.. ప్రజలు విశ్వసిస్తున్న సమయం లో హిందూ ఆధిపత్య మనస్తత్వాన్ని నాయకులు ప్రదర్శించడం.. పార్టీపైనే ప్రభావం పడేలా చేస్తోందని చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట.. శవయాత్రలో భగవద్గీతకు చోటు లేదు.. అలా చేయొద్దంటూ.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ హుకుం జారీ చేశారు.
వాస్తవానికి ఆయన విన్నవించాలి.. లేదా..తన అభిప్రాయం మాత్రమే చెప్పాలి. కానీ, హకుం జారీ చేయ డంతో.. రేపు పార్టీ అధికారంలోకి వస్తే.. వారి అభిప్రాయాల మేరకే హిందువులు నడుచుకోవాలి కాబోలు.. అనే చర్చజోరుగా తెరమీదికి వచ్చింది.
ఇక, తాజా పరిణామాలు.. మరింత దారుణంగా ఉన్నాయి. ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల ఫలితంగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందని.. అంటున్నారు పరిశీలకులు.
నిజానికి ఆయన కొన్నాళ్లుగా వివాదంగానే ఉన్నారు. ఇటీవల మునావర్ షోను అడ్డుకుని తీరుతామని.. హెచ్చరికలు చేశారు. ప్రాణం పోయినా ఫర్లేదు కానీ.. అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేశారనే వాదన కారణంగా.. హైదరాబాద్ సహా .. పలు జిల్లాలు అట్టుడుకుతు న్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. అధికార పార్టీని ఏదో చేయాలని అనుకుని.. బీజేపీనే తనకు తాను గోతులు తవ్వుకునే పరిస్థితి కల్పించుకుంటోందని అంటున్నారు పరిశీలకులు.
బీజేపీ నేతలు.. ఇప్పుడే ఇలా.. కేవలం సింగిల్ డిజిట్ ఎమ్మెల్యే స్థానాలకే ఎగిరెగిరి పడుతుంటే.. రేపు అధికారంలోకి వస్తే.. తెలంగాణ పరిస్థితి ఏంటనేది? ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం. మరి ఈ విషయంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.