ప్రభుత్వాన్ని నడిపేందుకు దాదాపు తొమ్మిది నెలల సమయం ఉన్న వేళలో.. అందుకు భిన్నంగా ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు గుర్తుందా? అందరి అంచనాలకు భిన్నంగా 2018లో ప్రభుత్వాన్ని రద్దు చేయటం ద్వారా.. ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. అప్పట్లో చెప్పిన మాటలు గుర్తున్నాయా? ఒకలాంటి ప్రచారం సాగుతుందని.. పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని.. లేని విమర్శల్ని పుట్టిస్తున్నారని.. అందుకే అందరికి సమాధానం చెప్పేందుకు తాము ప్రజల తీర్పు కోరాలని నిర్ణయించామని.. తెలంగాణను దెబ్బ తీసే కుట్రదారుల ఎత్తులను ఎన్నికల ఫలితాలతో చిత్తు చేస్తామని చెప్పిన కేసీఆర్.. షెడ్యూల్ కంటే ముందుగా ఎన్నికలకు వెళ్లటానికి కారణం విపక్షాల మీద పెట్టేశారు.
కట్ చేస్తే..ఇప్పుడు మళ్లీ అదే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికికారణం లేకపోలేదు. రెండో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన బీజేపీ అగ్రనేతల్లో ఒకరు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సవాలు విసిరారు. ''ఏదో ఒక రోజు ఎన్నికల క్షేత్రంలోకి దిగాల్సిందే. నేను ఒకటే చెబుతున్నా. ఫైవ్ స్టార్ ఫాంహౌస్ లో కూర్చొని పథకం రచిస్తున్నావు. ముందస్తు ఎన్నికలకు వెళదామనుకుంటున్నావు. ముందస్తు కాదు.. రేపుఎన్నికలు పెట్టు. మీ ఓటమిని రాసి పెడుతున్నాం'' అంటూ భారీ సవాలు విసిరారు.
సాధారణంగా సవాళ్లను స్వీకరించటమంటే గులాబీ బాస్ కు తెగ ఇష్టం. ఆయనకు సాహసాలు చేయటం కూడా ఆసక్తే. ఈ రెండు అలవాట్ల వల్లే.. తెలంగాణ ఉద్యమంలో పెద్దగా ఊపు లేని వేళ.. కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్ కు స్పందించిన కేసీఆర్.. పలు సందర్భాల్లో ఉప ఎన్నికలకు దిగటం.. ఆ సందర్బంగా భావోద్వేగ రాజకీయాల్ని రగిలించటం ద్వారా తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోగలిగారు. తెలంగాణ సిద్ధించి.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమయానుకూలంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 2018లో విపక్షాల మీద నింద మోపుతూ.. వేలెత్తి చూపిస్తున్న వారి వేళ్లను కిందకు దించేలా ఎన్నికలకు వెళుతున్నట్లుగా పేర్కొన్నారు.
అందుకు తగ్గట్లే ఆయన సానుకూల ఫలితాన్ని సొంతం చేసుకున్నారు. మరి.. ఇప్పుడు అమిత్ షా నేరుగా.. సూటిగా సవాలు విసిరిన నేపథ్యంలో.. తెలంగాణ ఉద్యమ వేళలోనూ.. 2018లోనూ ఎలాంటి సీన్ ను తెచ్చారో.. దాన్నే తాజాగా రిపీట్ చేస్తారా? అన్నది ప్రశ్న. ముందస్తుకు రావాలంటూ అమిత్ షా నేరుగా సవాలు విసిరిన వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.