కేసీయార్ పూర్తిగా ఓపెన్ అయిపోయినట్లే ఉన్నారు. రాష్ట్రంలోని కమలనాథులు ప్రత్యేకించి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద కోపమంతా నరేంద్ర మోడీ మీద చూపించినట్లున్నారు. దేశంలోని సకల అరిష్టాలకు మోడినే కారణమంటూ మండిపోయారు. చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ లో ఊర్లకు ఊర్లకు దంచి కొడుతుంటే ఏం చేస్తున్నాన్నారంటు వాయించేశారు. దేశం మొత్తంలో అగ్గి పెడతా, పార్లమెంటు దద్దరిల్లిపోవాలె అంటు ప్రకటించేశారు.
గడచిన ఏడేళ్ళల్లో మోడిపై కానీ కేంద్రం మీద కానీ కేసీయార్ ఈ స్ధాయిలో విరుచుకుపడలేదు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటమి కేసీయార్ పై పెద్ద ప్రభావాన్నే చూపినట్లుంది. ప్రతి విషయానికి తనను టార్గెట్ చేస్తున్న బండి మీద కూడా కేసీయార్ రెచ్చిపోయారు. తనను టచ్ చేసి చూడు, అరెస్టు చేసి బతికి బట్టకడతావా ? అంటు చాలెంజ్ విసిరారు. కమాన్ ముట్టుకుని చూడు ఏమవుతుందో అంటు ఓపెన్ చాలెంజ్ విసిరారు. 2018 ఎన్నికల్లో 107 సీట్లలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పార్టీ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకోవాలి ? అంటు మండిపోయారు.
మరిపుడు మీడియా సమావేశంలో అడిగిందే నిజమైతే ఇంతకాలం ఎందుకు ఊరుకున్నట్లో ? తనతో పాటు ఎంఎల్ఏలు, ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తామని ప్రకటించారు. తన విషయం మాట్లాడేటపుడు ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే నాలుక చీల్చేస్తానంటు వార్నింగ్ ఇచ్చారు. తన గురించి అడ్డం పొడుగు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. హుజూరాబాద్ ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన తమకేమీ కాదని తేల్చేశారు.
కేంద్రంతో ఎందుకు కయ్యం అని ఊరుకున్నారట. పెట్రోలు, డీజల్ మీద రు. 5, డీజల్ మీద రు. 10 తగ్గించటం కాదు మొత్తం పన్నులన్నీ తగ్గించేయాలన్నారు. పెట్రో ఉత్పత్తుల మీద తాను పైసా పెంచనపుడు తాను వ్యాట్ ఎందుకు తగ్గించాలని ప్రశ్నించారు. పన్నులు పెంచినోడే తగ్గించాలని తేల్చేశారు. అంటే తెలంగాణలో ఇంధన ధరలు తగ్గించేది లేదని చెప్పేశారు. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ 30 డాలర్లున్నపుడు కూడా మోడి ఎన్నో అబద్ధాలు చెప్పి దేశంలో పెట్రోలు, డీజల్ ధరలు పెంచేసినట్లు మండిపడ్దారు.
ఇంధనం మీద పన్నులు పెంచితే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సొస్తుందనే సెస్ పేరిట భయంకరంగా ధరలు పెంచేస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రాల నోళ్ళు కొట్టి జనాలను బాదుతున్న కేంద్రాన్ని మొన్నటి ఉపఎన్నికల్లో దంచికొట్టారని చెప్పారు. బహుశా 29 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచింది 7 చోట్ల మాత్రమే. ఇదే విషయాన్ని కేసీయార్ ప్రస్తావించారు. రేపటి ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోడి పెట్రోలు, డీజల్ పై 5, 10 రూపాయలు తగ్గించినట్లు చెప్పారు. మొత్తానికి మోడిపై ఇపుడు భయంకరంగా విరుచుకుపడిన కేసీయార్ ఎన్నిరోజులు ఇదే స్టాండ్ మీదుంటారో చూడాల్సిందే.