తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరలోనే జాతీయ పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారనేచర్చ జోరు గా సాగుతోంది. జాతీయ పార్టీ పెడితే.. ఎన్నికల నిబంధనల మేరకు గెలిచినా గెలవకపోయినా.. ఆయన ఓటు బ్యాంకును చూపించాల్సి ఉంటుంది.
దీనిని బట్టి ఆయన పొరుగు రాష్ట్రం ఏపీలో పావులు కదపడం ఖాయమనే అంటున్నారు. ఇటీవల ఏపీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయిన సందర్భంగా కేసీఆర్.. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారనే చర్చ సాగుతోంది.
ఏపీలో కనుక పార్టీని విస్తరిస్తే.. అక్కడ కేసీఆర్‌కు ఉన్న సానుకూలతలు ఏంటి? ఏయే జిల్లాల్లో పార్టీకి అనుకూలమైన పవనాలు ఉన్నాయనే అంశంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇలా చూసుకేంటే.. తెలంగాణ సరిహద్దులతో ముడిపడి ఉన్న జిల్లాల్లో కేసీఆర్‌కు మంచి పరిణామాలే కనిపిస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎప్పటి నుంచో.. కేసీఆర్ సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ జిల్లాను రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో కలిపేయాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది.
అదేవిధంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు.. కూడా కేసీఆర్ కు అనుకూలంగా మారనున్నాయి. ఆయా జిల్లాల సరిహద్దుల్లోని దాదాపు 22 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రభావం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర లోనూ.. కేసీఆర్‌కు అభిమానులు ఉన్నారు.
విశాఖపట్నంలోనూ.. కేసీఆర్‌కు సానుకూల పవనాలు ఉన్నా యి. ఈ నేపథ్యంలో సుమారు 30 నుంచి 35 నియోజకవర్గాల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే.. ఫలించే అవకాశం ఉంటుందని.. గెలిచినా గెలవకపోయినా.. ఓట్లను చీల్చే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.
మరోవైపు.. రాష్ట్రంలో అసంతృప్త ఓటు బ్యాంకు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని ఒడిసి పట్టుకునే ప్రయత్నాలను కూడా కేసీఆర్ ముమ్మరం చేస్తే.. ఆయనకు మరింత లబ్ధి చేకూరుతుంది. ఇక ఎటూ.. సంబంధం లేదని.. భావించే నగరాల్లోనూ.. ఉదాహరణకు.. విజయవాడ, విశాఖ, గుంటూరు లాంటి చోట్ల కూడా.. కేసీఆర్, కేటీఆర్ కు అభిమానులు కూడా ఉన్నారు. వెరసి వీటన్నింటినీ పరిశీలిస్తే.. పలు జిల్లాల్లో కేసీఆర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. తమకు ఏదో చేస్తారని ఆశించేవారి కన్నా.. ఏదైనా మార్పును కోరుకునేవారు పెరుగుతున్నారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.