తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను 360 డిగ్రీస్ లో విమర్శలు చేస్తూ.. ఆయన పాలనను తన మాటలతో చీల్చి చెండాడటమే కాదు.. వెనుకా ముందు చూసుకోకుండా మాటలు అనటంలో ముందుంటారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లడిన సందర్భంగా ఆయనకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కేసీఆర్ పాలన మరో పన్నెండు నెలలు మాత్రమే ఉంటుందని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీదే అన్న ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని చెప్పిన ఆయన.. టీఆర్ఎస్.. బీజేపీలు రెండు కూడబలుక్కొని మరీ డ్రామాలు ఆడుతున్నట్లు చెప్పారు.
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆరే స్వయంగా వ్యూహ రచన చేసినట్లుగా రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు అండగా ఉంటామని చెప్పేందుకే తాము వరంగల్ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ కీలక నేత రాహుల్ వస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చిందన్న మాట పదేళ్ల తర్వాత చెప్పుకుంటే ఏమొస్తుందన్న ప్రశ్నకు బదులిస్తూప. పదవే కావాలంటే గాంధీ కుటుంబం పదేళ్లు ప్రధాని కుర్చీలో కూర్చునే వీలుందని.. అయినప్పటికీ కూర్చోలేదనన్నారు. ఒకరాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావటం.. రాకపోవటం అన్నది పెద్ద చర్చ కాదన్నారు. సానుభూతి.. ఓట్లు.. నాటకాల కోసం కాంగ్రెస్ పార్టీ కానీ గాంధీ కుటుంబం కానీ ప్రయత్నం చేయదన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుందన్నారు. తెలంగాణను బీజేపీ మోసం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని.. అన్ని నేరాల్లో టీఆర్ఎస్ నేతలే ఉంటున్నారన్నారు. నిజాం కన్నా కేసీఆరే ఎక్కువగా సంపాదించారన్నారు. ఇక.. టీఆర్ఎస్ లోని 65 మంది ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇస్తే ఓడిపోతారని.. అదే జరిగితే పార్టీ మూడో స్థానానికి వెళుతుందన్నారు. అయినప్పటికి టీఆర్ఎస్ పార్టీ కేవలం 20 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకావం ఉందన్నారు. 70 స్థానాల్లో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని చెప్పారు. 20 -25 స్థానాల్లో మాత్రం టీఆర్ఎస్ - బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పారు.
టీఆర్ఎస్ ఓటింగ్ శాతం 50 నుంచి 35 శాతానికి పడిపోతుందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ మొత్తం కాంగ్రెస్ కు వెళుతుందన్నారు. అందుకే బీజేపీ గ్రాఫ్ ను వీలైనంత పెంచితే.. ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీ ఓటింగ్ టీఆర్ఎస్ వెంటే ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కు పీకే నివేదిక ఇచ్చారన్నారు. మరి.. రేవంత్ చెప్పినట్లు గులాబీ కోటలో సిట్టింగులకు షాకులిచ్చి కొత్త వారిని తెర మీదకు తెస్తారా? రేవంత్ మాటను లైట్ తీసుకొని ఎప్పటిలానే పెద్ద ఎత్తున సిట్టింగులకు సీట్లు ఇస్తారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగామారిందని చెప్పక తప్పదు.