తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాలను మార్చేందుకు తాను ఓ సైనికుడిలా పని చేస్తానని ఆయనే ఇటీవల ప్లీనరీలో కూడా వెల్లడించారు. అయితే, దీనికి తగినట్లుగా కేసీఆర్‌కు అవకాశం కలిసి వచ్చిందంటున్నారు. అదే రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడం. దీనికి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరును పరిశీలిస్తున్నారనే టాక్ ఉండటం.
టీఆర్‌ఎస్ నేత బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మే 30న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగిన అనంతరం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ స్థానాన్ని నటుడు ప్రకాశ్ రాజ్(prakash raj) తో భర్తీ చేయబోతున్నాడనే మాట జోరుగా వినిపిస్తోంది.
ప్రకాష్ రాజ్ పేరును పరిశీలించేందుకు కేసీఆర్‌కు లెక్కలు వేరే ఉన్నాయంటున్నారు. గత కొంత కాలంగా బీజేపీ భావజాలంపై వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ నేషనల్ పాలిటిక్స్ లో చురుగ్గా ఉన్నారు. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ప్రకాశ్ రాజ్ కు మంచి గుర్తింపు ఉంది.
ఇప్పటికే కర్ణాటక టూర్‌కు వెళ్లిన సమయంలో ప్రకాష్ రాజ్‌తో కలిసి మాజీ ప్రధాని దేవేగౌడను కలిశారు. ఇటీవల మహారాష్ట్ర పర్యటనలో కూడా సీఎం ఉద్దవ్ ఠాక్రే తో సమావేశానికి ప్రకాష్ రాజ్‌ను వెంటబెట్టుకొని వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌కు అవకాశం కల్పించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో మరింత కీలకంగా మారాలనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.
అయితే, కేసీఆర్ కేవలం ప్రకాష్ రాజ్ పేరు మాత్రమే పరిశీలించడం లేదని చెప్తున్నారు. తన కూతురు కవితకు జాతీయ రాజకీయాల బాధ్యత అప్పగించడంలో భాగంగా ఆమెను సైతం రాజ్యసభకు పంపే అవకాశాన్ని పరిశీలించవచ్చని అంటున్నారు. కవితతో పాటుగా మరికొందరు నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ అవి కేవలం ప్రచారంలో మాత్రమే ఉన్న పేర్లు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.