రెండు రాష్ర్టాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరగడం అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు అదే బాటలో తెలంగాణ ప్రతిపక్షాలు నడిచేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత - ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఛాంబర్ లో టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ పై అవిశ్వాసం పెట్టె అంశాన్ని పరిశీలించాలని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. దీనిపై నిబంధనలని పరిశీలించిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పై అవిశ్వాసానికి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అనే నిబంధనలు ఉండటాన్ని ప్రస్తావించారు. అందుకే స్పీకర్ పై కాకుండా తెరాస ప్రభుత్వం పై అవిశ్వసం పెట్టాలని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చకి రావడానికి 12 మంది ఎమ్మెల్యేల బలం అవసరం అని కాంగ్రెస్ ఈ సందర్భంగా గుర్తించింది. అయితే కేసీఆర్ సర్కారుపై అవిశ్వాసం పెట్టాలా వద్దా అనే తర్జన భర్జనపడ్డట్లు సమాచారం. ఈ క్రమంలో మరో మారు చర్చించుకోవాలని భావించారు.