టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ - కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం తారాస్థాయికి చేరిన సమయంలోనే...కొత్త చర్చలు మొదలయ్యాయి. మాటకారితనంతో ప్రాచుర్యం - రాష్ట్రస్థాయి పదవి పొందిన రేవంత్ రెడ్డి ప్రభావంపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా - ఎక్కడా ఆయనకు ప్రత్యేకమైన క్యాడర్ అంటూ లేనేలేదు. ఆయా నియోజకవర్గాల్లో అక్కడి నాయకులే ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు గుర్తింపు ఉండింది. కాంగ్రెస్ లో చేరితే అదొక సముద్రం. అక్కడ తిమింగలాలు ఉంటాటాయి. రేవంత్ లాంటి చేపలను సునాయాసంగా మింగేస్తాయని కూడా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రేవంత్ రెడ్డి కన్నా సీనియర్లే.
ఉమ్మడి పాలమూరులో మహబూబ్ నగర్ - జడ్చర్ల - నారాయణపేట - మక్తల్ - కల్వకుర్తి - గద్వాల - అలంపూర్ - దేవరకద్ర - వనపర్తి - నాగర్ కర్నూల్ - అచ్చంపేట - కొల్లాపూర్ - కొడంగల్ - షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ప్రస్తుతం షాద్ నగర్ - కొడంగల్ లోని కొంతభాగం వికారాబాద్ జిల్లాలో చేరాయి. మిగిలిన తాలూకాలన్నీ యథావిధిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వంశీచంద్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గద్వాల - వనపర్తి - అలంపూర్ లలోను డీకే అరుణ - జిల్లెల చిన్నారెడ్డి - సంపత్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మిగిలినచోట్ల కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేకున్నా ఆయా నియోజకవర్గ ఇన్ చార్జీలున్నారు. ఈ స్థానాల్లో ఎటుచూసినా రేవంత్ రెడ్డి ప్రభావం మచ్చుకైనా కనిపించదు. పాలమూరు నుంచి టీడీపీ ముఖ్యనేతలు రేవంత్ రెడ్డి వెంటవెళ్లే సంగతేమోకానీ - ఆయన సొంత నియోజకవర్గంలోనే తమ్ముళ్లు టీడీపీని వీడుతున్నారు.
టీడీపీ సీనియర్లు రావుల చంద్రశేఖర్ రెడ్డి - కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు - ఎర్ర శేఖర్ స్వతంత్రంగా పనిచేసినవారే తప్ప రేవంత్ రెడ్డిపై ఆధారపడిన చరిత్ర లేదు. నేరుగా చంద్రబాబుతోనే సంబంధాలున్నాయి. రేవంత్ తో సఖ్యత అంతంత మాత్రమే. ఇతరప్రాంతాల నుంచి రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారాన్ని రాజకీయ విశ్లేషకులు విచిత్రంగా చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ క్యాడర్ అంతా టీఆర్ ఎస్ గూటికి చేరింది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ కూడా ఇటీవలే టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అసలు రేవంత్ రెడ్డికి క్యాడర్ ఎక్కడ, ఎంత ఉన్నదన్న ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. రేవంత్ కాంగ్రెస్ లో చేరతారన్న దానిపై రెండురకాల వాదనలు కాంగ్రెస్‌లోనే వినిపిస్తున్నాయి. ఒకవర్గం నుంచి సానుకూలత కనిపిస్తే, మరోవర్గం నుంచి వ్యతిరేక ధోరణి వినిపిస్తున్నది. ‘ధీశాలి.. గట్టి నాయకుడు’ అంటూ సంబోధించటం కూడా కాంగ్రెస్ లో అందరికీ నచ్చటంలేదు. రేవంత్ కాంగ్రెస్ లో చేరితేగాని అసలు సీన్ బయటపడదని అంటున్నారు.