బాబు ఇసుక దీక్ష‌కు తెలంగాణ కూలీలు... కూలి రేటు ఎంతంటే..!

Update: 2019-11-14 09:04 GMT
ఏపీ లో ఇసుక కొర‌త తీవ్రంగా ఉంద‌ని... ల‌క్ష‌లాది మంది భ‌వ‌న నిర్మాణ కార్మికులు ప‌నులు లేకుండా ఖాళీగా ఉంటున్నార‌ని ప్ర‌తి ప‌క్షాల నుంచి కొద్ది రోజులు గా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యం లోనే ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబు గురువారం విజ‌య‌వాడ‌ లో ఇసుక దీక్ష‌ కు దిగిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇదే అంశం పై విశాఖ వేదిక‌ గా లాంగ్‌ మార్చ్‌ కు పిలుపు ఇచ్చారు. దీనికి మంచి క్రేజ్ వ‌చ్చింది.

ఇప్పుడు పులిని చూసి న‌క్క వాత‌లు పెట్టుకున్న చందం గా బాబు ఇసుక దీక్ష‌ కు దిగుతున్నారు. ఓ వైపు వ‌ర‌ద‌లు ఎక్కువుగా ఉన్నాయి. అటు ఉత్త‌రాంధ్ర నుంచి ఇటు సీమ వ‌ర‌కు ఎక్క‌డ చూసినా వాగుల్లో నీళ్లు వెళుతున్నాయి. గ‌త 14 సంవ‌త్స‌రాల‌ లో ఈ యేడాది ప‌డినంత వ‌ర్షం ఎప్పుడూ ప‌డ‌లేదు. ఈ క్ర‌మం లోనే ఇసుక కొర‌త అనేది ప్ర‌కృతి వైప‌రీత్యం గా ఉంది. దీనిని అర్థం చేసుకో లేని బాబు ఏం చేయాలో తెలియ‌క ఇసుక దీక్ష‌ కు దిగ‌డం సామాన్య జ‌నాల‌ కు సైతం రుచించ‌డం లేదు.

ఇక బాబు ఇసుక దీక్ష తెలుగు త‌మ్ముళ్ల‌ కు ఇబ్బంది గా మారింది. ఈ ఇసుక దీక్ష‌కు వేలాది మందిని తీసుకు వ‌చ్చి ప్ర‌భుత్వం పై భారీ వ్య‌తిరేక‌త ఉంద‌న్న సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి పంపాల‌ని పార్టీ నేత‌ల‌ కు సూచించారు. విజ‌య‌వాడ‌లో దీక్ష జ‌రుగుతుండ‌డం తో ఈ ప్రాంతానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న తెలంగాణ‌ లోని న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం జిల్లాల నుంచి భ‌వ‌న నిర్మాణ కూలీల‌ తో పాటు అక్క‌డ వ్య‌వ‌సాయ ప‌నులు లేని కూలీల‌ ను ర‌ప్పించారు. ఇందు కోసం ఆర్టీసీ బ‌స్సుల‌ ను సైతం వాడుకున్నారు.

ఇందు కోసం దీక్ష‌ కు వ‌చ్చిన వాళ్ల‌కు ఒక్కొక్క‌రికి రు.500 వ‌ర‌కు ఇచ్చారు. స్థానికం గా రాజ‌ధాని జిల్లాల‌ తో పాటు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నుంచి ఇక్క‌డ‌ కు వ‌చ్చేందుకు పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవ్వ‌రూ ఆస‌క్తి చూప‌లేదు. ఈ విష‌యం ముందే గ్ర‌హించిన పార్టీ అధిష్టానం తెలంగాణ‌ లోని స‌రిహ‌ద్దు జిల్లాల‌ కు చెందిన కూలీల‌ ను తీసుకువ‌చ్చి జ‌న ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని భావించింది. దీని వ‌ల్ల అస‌లు దీక్ష ప్ర‌యోజ‌నం ఎలా ?  నెర‌ వేరుతుందో ?  బాబుకే తెలియాలి.
Tags:    

Similar News