అనూహ్యంగా తెర మీదకు వచ్చిన లాక్ డౌన్.. తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండిపోవటం తెలిసిందే. దీనిపై పలువురు విమర్శలు చేసినా.. బాబు రియాక్టు కాలేదు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఆయన ఆ మధ్యన విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఉదంతం నేపథ్యంలో తనను విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
అప్పటికి ఆగిన ఆ ప్రక్రియతో ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. దాదాపు రెండు నెలలకు పైనే ఏపీ విపక్ష నేత తెలంగాణలో ఉండిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఏపీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ డీజీపీ.. ఏపీ డీజీపీలకు లేఖలు రాశారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఏపీకి వెళ్లేందుకు అనుమతిని జారీ చేశారు.
దీంతో.. చంద్రబాబు ఏపీకి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు చెప్పాలి. కాకుంటే.. ఏపీ డీజీపీకి ఆన్ లైన్ లో చేసుకున్న దరఖాస్తుకు ఇప్పటివరకూ స్పందన రాలేదు. ఇదిలా ఉంటే.. సోమవారం (మే 25న) హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాలని భావిస్తున్న బాబు.. తొలుత విశాఖకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
మార్చి 20 నుంచి ఇప్పటివరకూ హైదరాబాద్ లో ఉన్న ఆయన.. సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఏపీకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. మరి.. ఆయన ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు చోటు చేసుకోకుండా ఏపీ డీజీపీ అనుమతి పత్రాలకు ఓకే చెబుతారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.