‘బార్లా’ తెరిచి ఉంచేందుకు టీ సర్కారు ఓకే

Update: 2015-12-26 07:13 GMT
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ.. డిసెంబరు 31 తేదీన ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూఇయర్ కు ముందు రోజు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ఎంజాయ్ చేయటం చేస్తుంటారు. ఈ హుషారుని మరింత కిక్కు ఎక్కేలా తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 31న అర్థరాత్రి 12 గంటల వరకూ బార్లు.. అర్థరాత్రి ఒంటి గంట వరకూ క్లబ్బుల్లో మద్యం అమ్మకాలు జరపవచ్చంటూ అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీంతో.. మద్యం ప్రియులకు డిసెంబరు 31న పండగే పండుగ అన్నట్లుగా ఉంటుందని చెప్పక తప్పదు. ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. ఈ నేపథ్యంలో న్యూఇయర్ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగటం ఖాయమని చెబుతున్నారు. అధికారికంగానే బార్లలో అర్థరాత్రి వరకూ.. క్లబ్బుల్లో ఒంటి గంట వరకూ అంటే.. కాస్తంత అటూఇటూగా చూస్తే.. డిసెంబరు 31న మద్యం ప్రియులు భారీగా మత్తులో తూలిపోవటం ఖాయమన్న మాటే.
Tags:    

Similar News