పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి.. వాటికి అవసరమైన నిధుల కోసం కిందామీదా పడుతున్న తెలంగాణ సర్కారు భారీగా ఆదాయాన్ని చేజిక్కించుకునే మార్గాల వైపు దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్న అక్రమ లేఔట్లు.. అక్రమ నిర్మాణాలకు క్రమబద్ధీకరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపుతూ మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫార్సులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలపటమే కాదు.. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ రోజు (బుధవారం) దీనికి సంబంధించి అధికారిక జీవో రిలీజ్ చేయనున్నారు.
తాజాగా నిర్ణయించిన క్రమబద్ధీకరణతో తెలంగాణ ప్రభుత్వానికి దాదాపుగా రూ.3వేల కోట్ల మేర ఆదాయం లభించే వీలుందని చెబుతున్నారు. తాజా బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్).. ఎల్ ఆర్ ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్) కు కటాఫ్ తేదీగా 2015 సెప్టెంబరు 30గా అమలు చేయాలని నిర్ణయించారు. అంటే.. ఈ తేదీ లోపు వరకు ఉన్న అక్రమ లేఔట్లు.. అక్రమ నిర్మాణాలకు తగిన అపరాధ రుసుము చెల్లించటం ద్వారా అక్రమం నుంచి సక్రమంగా మారే ఛాన్స్ లభించనుంది. అక్రమ నిర్మాణాలు.. లే ఔట్ల విషయంలో కరకుగా వ్యవహించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. తాజా క్రమబద్ధీకరణ లాస్ట్ ఛాన్స్ గా తెలంగాణ ప్రభుత్వం అభివర్ణిస్తోంది. దాదాపు రెండు నెలల గడువులో ఈ ప్రక్రియను పూర్తి చేయలని భావిస్తోంది.
తాజా క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయాన్ని అంచనా వేస్తున్న తెలంగాణ సర్కారు.. ఇందుకు ఇచ్చిన సమయం తక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. క్రమబద్ధీకరణకు ఇచ్చిన సమయం రెండు నెలలు మాత్రమే ఉంటుందా? లేక మరింత ఎక్కువ ఉంటుందా? అన్న విషయం అధికారిక ఉత్తర్వులలో తేలనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు నెలలు మాత్రమే గడువు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించి.. ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో సామాన్య.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతికి చెందిన వారు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
అయితే.. క్రమబద్ధీకరణ కోసం నిర్ణయించిన మొత్తం (అపరాధ రుసుం) భారీగా పెంచినట్లుగా చెబుతున్నారు. గతంలో పోలిస్తే..ఈసారి క్రమబద్ధీకరణ మొత్తం రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్న మాట.. పలువురికి భారంగా మారే వీలుంది. అయితే.. దీనికి సంబంధించిన స్పష్టత జీవో విడుదల ద్వారా తేలనుంది. క్రమబద్ధీకరణ విషయంలోనూ కొన్ని పరిమితులు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ భూముల్లో.. టైటిల్ లేని భూముల్లో.. చెరువులు.. శిఖం భూములు.. నాలా.. డ్రైన్ లపై నిర్మించిన భవనాలను అనుమతించరు. అదే విధంగా మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూడా క్రమబద్ధీకరణ చేయకూడదని నిర్ణయించారు. మరి.. ఇన్ని ఆంక్షల నేపథ్యంలో క్రమబద్ధీకరణ ద్వారా రూ.3వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలన్న తెలంగాణ సర్కారు ఆలోచన ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందన్నది పెద్ద ప్రశ్నే.